తల్లి కాబోతున్న కీర్తి సురేశ్..?పెళ్లైన నాలుగు నెలలకే గుడ్ న్యూస్
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేశ్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు.ఇటీవల కాలంలో కీర్తి సురేశ్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. గతంలో కీర్తి సురేశ్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేశ్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

నేటి తరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేశ్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్ చేయడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక గతేడాది బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.కీర్తి సురేశ్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేశ్. తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేశ్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆప్డేట్స్ ఇస్తుంటుంది.పెళ్లి తర్వాత వరుస ఫొటో షూట్స్‌తో మతి పోగొడుతోంది. అయితే కీర్తి సురేశ్ తాజాగా షేర్ చేసిన ఫొటోషూట్ ఆమె పొట్ట దగ్గర కాస్తా ఎత్తుగా కనిపించింది. దీంతో ఆమె గర్భవతి అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంటా ఏంటీ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ,మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంపై కీర్తి సురేశ్ ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications