రష్మికతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యా..!
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.
గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప-2'తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో ఛావా ఇలా టాలీవుడ్ నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. అయితే నితిన్ సినిమాలో రష్మికను తీసుకున్నట్టే తీసుకుని ఆ తర్వాత ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆ సినిమానే 'రాబిన్ హుడ్'.ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. తాజాగా దీనిపై శ్రీలీల స్పందించారు.

ఆమె మాట్లాడుతూ..రాబిన్ హుడ్ సినిమాలో రష్మికతో కొన్ని సీన్లు షూట్ చేశారు, అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకుందని శ్రీలీల చెప్పుకొచ్చింది. దీంతో ఆ సినిమాలోకి తాను ఎంట్రీ ఇచ్చానని ఈ బ్యూటీ తెలిపింది. ఇదే సమయంలో పుష్ప-2 సినిమాలో తాను స్పెషల్ సాంగ్ చేయడం, ఆ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించడంతో, ఆమెతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యానని, కానీ ఇవేమి పట్టించుకుని రష్మిక తనతో సరాదాగా మాట్లాడిందని దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నేను రష్మిక మంచి ఫ్రెండ్స్ అయ్యాము. రాబిన్ హుడ్ మూవీలో నా క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చింది. రష్మికపై శ్రీలీల చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications