బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల..ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ
తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.
ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది.

అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. దీంతో శ్రీలీల ఆఫర్ల కోసం కొత్త దారిని వెతుకుతోన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది. తాజాగా ఈ భామ బాలీవుడ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా బల్వీందర్ సింగ్ దర్శకత్వంలో 'మిట్టి' అనే సినిమా తెరకెక్కబోతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ వినగానే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిట్టి మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందని అందుకే ఈ బ్యూటీ మూవీకి ఓకే చెప్పిందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న మిట్టి మూవీ.. అక్టోబర్ లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో శ్రీలీల నటిస్తోంది.












Click it and Unblock the Notifications