ప్రముఖ నటుడికి వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.దీంతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా శ్రీలీలనే ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇటీవలే శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప2 సినిమాలో ఐటం సాంగ్‌లో నటించింది.కిస్సక్ అంటూ కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీకి వార్నింగ్ ఇస్తోన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇది సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ కాదు. పుష్ప2 సినిమాలో కిస్సక్ సాంగ్‌కు వీరిద్దరు రీల్స్ చేశారు. బ్రహ్మాజీ కలిసి దెబ్బలు పడతాయ్ రాజా సాంగ్‌కు రీల్ చేశారు. ఇందులో బ్రహ్మాజీ కూర్చొని వీడియో తీస్తుండగా శ్రీలీల తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దెబ్బలు పడతాయి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications