పుష్ప 2 ఐటెంసాంగ్ కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప చిత్రం రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక, ఆయన అభిమానులంతా పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు పుష్ప 2 రీలీజ్ డేట్స్ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ప్రతి వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా అదికాస్త నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిపోతుంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఐటెంసాంగ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. అది కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గామారింది. ఐటెంసాంగ్‌లో శ్రీలీల నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రంలోని ఐటెంసాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక, ఈ సారి కూడా అదే రేంజ్‌లో ఉండేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకోసం ఈ సారి శ్రీలీలను రంగంలోకి దించారు. పుష్ఫ2 చిత్రం కోసం సుమారు రూ. 500కోట్ల బడ్జెట్‌ను ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఐటెం సాంగ్ కోసం అంతకుమించి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఐటెం సాంగ్ కోసం భారీ సెట్‌నే ఏర్పాటు చేశారట..

రూ. 2కోట్ల పారితోషికం...
ఐటెం సాంగ్ కిస్సిక్‌లో శ్రీలీల నటించినందుకు గాను రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సాంగ్ కోసం భారీ సెట్, హీరోయిన్ పారితోషికం అంతా కలిపి సుమారు రూ.5 కోట్లు దాటిందనే టీ టౌన్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. నటి శ్రీలీల తన సినిమాలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మొత్తాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వారం రోజులకు గాను శ్రీలీలకు ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 17న పుష్ప 2 నుంచి ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించేశారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చరారు. ఇక, ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.












Click it and Unblock the Notifications