భర్త ముందే మరో హీరోతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం. అయితే ఓ హీరోయిన్ విచిత్రంగా తన భర్త ముందే మరో హీరోతో రొమాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాయ్.
ఆ వివరాల్లోకి వెళ్తే..ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళలో ఇరువర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు.

ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. ఇదే సమయంలో వివేక్ ఒబెరాయ్ , సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించింది ఈ బ్యూటీ. వీరికి బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. విచిత్రం ఏమిటంటే.. ఐశ్వర్య రాయ్ వేరే హీరోలతో రొమాన్స్ సినిమాల్లో అభిషేక్ బచ్చన్ అదే సినిమాల్లో నటించారు. ధూమ్ 2 , విలన్ వంటి సినిమాల్లో ఐశ్వర్య రాయ్ సరసన హృతిక్ రోషన్,విక్రమ్ వంటి హీరోలు నటించారు.ఈ రెండు సినిమాల్లో కూడా అభిషేక్ బచ్చన్ పోలీస్ గెటప్‌లో నటించారు. ముఖ్యంగా ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్‌తో ఐశ్వర్య రాయ్ లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. ఇలా భర్త నటించిన సినిమాల్లోనే మరో హీరోతో రొమాన్స్ చేసిన ఘనత ఐశ్వర్య రాయ్‌కి దక్కింది.












Click it and Unblock the Notifications