ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్ .. బర్త్ డే కు 6 రోజుల ముందే..

ప్రముఖ బుల్లితెర నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీడియో కాల్‌ లో భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురైన సుభాషిణి సూసైడ్‌ చేసుకున్నట్లు సమాచారం. ఇక సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నటి సుభాషిణి మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఇండస్ట్రీలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రముఖ బుల్లితెర నటి సుభాషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఆరు రోజుల్లో ఆమె పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో వీడియో కాల్‌ లో భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుభాషిణి తన నివాసంలోని ప్రైవేట్ అపార్ట్‌ మెంట్‌ లో ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Subhashini TV Actress Commits Suicide Just Six Days Before Her Birthday Subhashini death news

ఇక శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌ తో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. అయితే షూటింగ్‌ల నిమిత్తం చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటన కొనసాగిస్తున్నారు సుభాషిణి. 'కయల్' అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందారు సుభాషిణి. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండేవారు. తన నటనతో ఇన్‌ స్టాగ్రామ్‌ లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు సుభాషిణి. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో అనూహ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+