Ambajipeta Marriage Band: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..
ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్నాయి. హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. తాజాగా మరో చిన్న చిత్రం కూడా మంచి రాబడి సాధిస్తోంది. యువ నటుడు సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మంచి టాక్ తో నడుస్తోంది. సుహాస్ గతంలో కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా విజయ పథంలో దూసుకెళ్తోంది.
ఈ సినిమాలో సమాజంలో జరుగుతున్న ఘటనలు చూపించారు. కులాల, పరువు ప్రేమ నేపథ్యంలో ఈ మూవీని కటికినేని దుశ్యంత్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సుహాస్ కు జంటగా.. శివాని నాగరం నటించారు. హీరో అక్కగా శరణ్య ప్రదీప్ నటించారు. పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగదీశ్ కూడా అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల రాబడుతోంది.

ఈ సినిమా విడుద రోజు మంచి కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.2.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించడంతో నిర్మాతలు మస్త్ కుషిగా ఉన్నరు. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో రెండు రోజు కూడా భారీ కలెక్షన్లే వచ్చాయి. అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండు మూవీకి రెండో రోజు దాదాపు రూ.3 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ సుహాస్ మంచి హిట్ ఇచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది. సుహాస్, శివాన్ రాయలసీమలో సక్సెస్ టూర్ కు వెళ్లనున్నారు. ఆదివారం కర్నూలులోని ఆనంద్ థియేటర్‌కు మధ్యాహ్నం 12: 30గంటలకు చిత్ర యూనిట్ వెళ్లనుంది. ఆ తర్వాత కడపలోని రాజా థియేటర్‌కు మధ్యాహ్నం 3:30 గంటలకు వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వెళ్తారు.












Click it and Unblock the Notifications