ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి!!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక ఉన్న పూర్తి మిస్టరీ తేలలేదు. సుశాంత్ మరణం తర్వాత అతని ప్రేయసి రియా చక్రవర్తి పై సుశాంత్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో మనీ లాండరింగ్ ఆరోపణలపై రియా చక్రవర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును ఎదుర్కొన్నారు.
సంచలన వ్యాఖ్యలు చేసిన సుశాంత్ సింగ్ ప్రేయసి
రియా చక్రవర్తి తో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు కలిగివున్నారన్న ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసులో వీరు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో కనుమరుగైపోయింది. ఇక తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి రియా చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది.

నా జీవితంలో చాప్టర్ 2 అన్న రియా చక్రవర్తి
ప్రస్తుతం తాను ఏం చేస్తున్నాను? తను ఎలా బ్రతుకుతున్నాను అని చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్న నటి రియా తాను కొంతకాలంగా సినిమాల్లో నటించడం లేదని, తన జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించాను అని పేర్కొన్నారు. నా జీవితంలో చాప్టర్ 2 ఇది అని పేర్కొన్న రియా చక్రవర్తి తాను మోటివేషనల్ స్పీకర్ గా మారానని తద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని తెలిపారు.
ప్రేమలో పడ్డానన్న సుశాంత్ ప్రేయసి
మోటివేషన్ పై ప్రేమలో పడ్డానన్న రియా సినిమాలలో నటించకున్నా తనకు పర్వాలేదని చెప్పింది. గతంలో తన లైఫ్ లో ఏం జరిగిందో, తాను ఎదుర్కొన్న సవాళ్లు.. అనుభవించిన బాధ ఏమిటో తనకు మాత్రమే తెలుసు అన్న రియా చక్రవర్తి తన గురించి ఎదుటివారు ఎన్నో ఊహించుకున్నారని అన్ని తమకే తెలుసు అనుకున్నారని, నిజా నిజాలు తెలియక చాలామంది నాపై విమర్శలు చేశారని పేర్కొన్నారు.
సుశాంత్ కు చేతబడి చేశానన్నారు
ఇంకా కొంతమంది నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు చేతబడి చేశానని చెప్పారని పేర్కొన్న రియా చక్రవర్తి, నేను ఎదుటి వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా నాకు నేను నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ధైర్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications