శుభవార్త చెప్పిన తమన్నా..!
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇదిలా ఉంటే తమన్నా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.
తమన్నా మొన్నటి వరకు గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.వీరు కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.2022 నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. మీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. రిలేషన్‌పై వీరిని ప్రశ్నించగా. అలాంటిది ఏమీ లేదని..మేమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు.
విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు. దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది.పలు ఈవెంట్స్‌లో తమన్నాతో కలిసి విజయ్ వర్మ సందడి చేశారు.
పలు ఫంక్షన్స్‌లో తమన్నా హ్యాండ్ బ్యాగులు కూడా మోస్తూ విజయ్ వర్మ కనిపించారు. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాకిచ్చింది తమన్నా. ప్రియుడు వర్మకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది.తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయారని అనుకున్నారు.
దీంతో తమన్నా, విజయ్ వర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయిందని అంతా భావించారు. అయితే వీరిద్దరు తిరిగి కలిసిపోయారు.తాజాగా వీరిద్దరు కలిసి ఉన్న వీడియో ఒకట నెట్టింట వైరల్‌గా మారింది. తమన్నా, విజయ్‌లు ఎంతో క్లోజ్‌గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ చేతిలో చేయి వేసి మరీ తమన్నాను కారు డోర్ తీసి ఎక్కించాడు. అలాగే తన చీరను కూడా డోర్‌కి ఇరుక్కోకుండా లోపలికి సర్దడం ఈ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత అదే కారులో వీరిద్దరు కలిసి వెళ్లారు. దీంతో ఈ జంట విడిపోలేదని స్పష్టం అయింది.












Click it and Unblock the Notifications