ప్రైవేట్ పార్టీలో నిమిషానికి కోటి రూపాయిల వసూలు చేసిన తెలుగు హీరోయిన్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన గ్లామర్‌తో, నటనతో ఒక ఊపు ఊపేస్తున్న నటి తమన్నా భాటియా. కెరీర్ మొదలుపెట్టి దశాబ్ద కాలం దాటినా, ఇప్పటికీ తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గనివ్వకుండా కాపాడుకుంటోంది ఈ భామ. అయితే తాజాగా ఆమె తీసుకున్న ఒక పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇటీవల గోవాలో జరిగిన గ్రాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ప్రైవేట్ పార్టీలో ఆమె తన హిట్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. దాదాపు 6 నిమిషాల పాటు సాగిన ఈ పర్ఫార్మెన్స్‌కు ఆమె ఏకంగా 6 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లు సమాచారం. అంటే ఒక్కో నిమిషానికి ఒక కోటి రూపాయలన్నమాట. బాలీవుడ్‌లో ఇలాంటి ప్రైవేట్ పార్టీ పర్ఫార్మెన్స్‌లకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ, తమన్నా రేంజ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన తమన్నా, ఇప్పుడు తన రూట్ మార్చింది. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా.. క్రేజీ ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.

సినిమా హీరోయిన్‌గా చేసేందుకు 6 నుంచి 8 కోట్లు తీసుకునే తమన్నా, కేవలం ఒకే ఒక్క పాటలో మెరవడానికి 5 నుంచి 6 కోట్లు డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం నీరజ్ పాండే దర్శకత్వంలో వస్తున్న 'సికందర్ కా ముకద్దర్' వంటి క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
తెలుగులో గతంలో ఉన్నంత స్థాయిలో సినిమా అవకాశాలు రాకపోయినా, తమన్నా ఏమాత్రం తగ్గడం లేదు. వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్లు, మరియు ఐటమ్ సాంగ్స్ ద్వారా తన ఆదాయాన్ని డబుల్, ట్రిపుల్ చేసుకుంటోంది. గ్లామర్ పాత్రల నుంచి సీరియస్ రోల్స్ వరకు ఆమె చూపిస్తున్న వైవిధ్యం ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతోంది.
-
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !!












Click it and Unblock the Notifications