'మిరాయ్' సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ సినిమాకు మక్కీకి మక్కీలా దింపేశారు!!

తెలుగు సినీ పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం మిరాయ్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ లో రూ.60 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లో విజయ పథాన దూసుకుపోతోంది. చిన్న హీరో అయినప్పటికీ ఎంత చక్కగా కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడో తేజ సజ్జాను చూసి ఇతర హీరోలు నేర్చుకోవచ్చు. హనుమాన్, మిరాయ్ తర్వాత మరో రెండు సినిమాలు ఇలాంటివే ఇవ్వగలిగితే స్టార్ హీరోల లీగ్ లో తేజ చేరతాడు. కచ్చితంగా చేరే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు.

5 రోజులకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు సాధించింది. మరో వారం రోజులు ఈ సినిమా హవా కొనసాగే అవకాశం ఉంది. తర్వాత పవన్ కల్యాణ్ నుంచి ఓజీ రాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆ సినిమాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ నటించిన మహా బలుడు సినిమాకు మక్కీకి మక్కీలా దింపేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అంతేకాకుండా మహాబలుడుకు సంబంధించిన యూట్యూబ్ లింకు కూడా కొంతమంది షేర్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం మిరాయ్ కు, మహాబలుడుకు ఎక్కడా పోలికే లేదంటున్నారు.

teja sajja movie Mirai was compared to the movie Superstar Krishna movie

ఓ నెటిజన్ మహాబలుడు సినిమాను అలాగే దించేశారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు. ఇదంతా ఏదో బురద చల్లే పోస్టులా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేశమైనప్పటికీ ఆ సినిమాను కూడా ఒకసారి చూస్తే ఈ రెండు సినిమాలు ఒకేలా ఉన్నాయా? లేదంటే వేర్వేరా? అనేది అర్థమవుతుందని కొందరు అంటున్నారు.

మిరాయ్ లోని యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ వర్క్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. హిందీలో కూడా మంచి వసూల్లు రాబట్టే అవకాశం ఉంది. ఒక టికెట్ కు మరో టికెట్ ఉచితం అంటూ హిందీలో ఆఫర్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+