'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు వచ్చేశాయ్..ఆ క్రైమ్ థ్రిల్లర్ డోన్ట్ మిస్
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

అక్కినేని అఖిల్ హీరోగా రెండేళ్ల క్రితం నటించిన 'ఏజెంట్' సినిమా 'ఐ బొమ్మ'లోకి వచ్చింది. బ్రహ్మానందం ఆయన తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రహ్మా ఆనందం' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. జబర్థస్త్ నటుడు ధనరాజ్ నటించి దర్శకత్వం వహించిన 'రామం రాఘవన్' సినిమా 'ఐ బొమ్మ'లో ప్రత్యక్షం అయింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన 'జితేందర్ రెడ్డి' సినిమా సైతం 'ఐ బొమ్మ'లో అందుబాటులోకి వచ్చింది. ఇక పలు డబ్బింగ్ సినిమాలు సైతం 'ఐ బొమ్మ'లో దర్శనం ఇచ్చాయి.
బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన 'పోన్‌మ్యాన్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్ తో తీయగా, 18.30 కోట్ల వసూళ్లు సాధించింది.మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను మీరు కూడా ఓసారి చూసేయండి.కుంచాకో బోబన్ హీరోగా నటించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమా సైతం ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కేరళలో బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' కూడా 'ఐ బొమ్మ'లో దర్శనం ఇచ్చింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్‌లో చక్కగా ఈ సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసేయండి.












Click it and Unblock the Notifications