కుక్క బిస్కెట్లు తింటున్న తెలుగు స్టార్ హీరోయిన్... లిప్‌కిస్‌కు హీరోలు దూరం
సాధారణంగా ఏదో ఒక విషయంలో ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది. మంచి అలవాటైతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే అలవాటు మంచిది కాకపోతే ఇంట్లోనే మానేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. అయినప్పటికీ ఎంత వయసు వచ్చినా వాటిని మానుకోలేనివారే కోకొల్లల్లుగా ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ అలవాట్లుంటాయి. తమకు ఇష్టమైన ఫుడ్ తినే విషయాన్ని చాలామంది సెలబ్రిటీలు అనేక ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. కొందరు అభిమానులైతే వాటిని అనుసరిస్తుంటారు. తాజాగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఓ హీరోయిన్ కు ఓ వింత అలవాటు ఉంది. ఆమెతో నటించిన హీరో ఒకరు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు.
అన్ని భాషల్లో నటిస్తోంది
తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉండటంతోపాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లో కూడా వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. స్నాక్స్ తినే సమయంలో ఆమె అందరిలా ఏదిపడితే అది తినదు. కుక్క బిస్కెట్లు తింటుంది. చిన్నతనం నుంచి ఉన్న అలవాటు అది. ఈ వింత అలవాటు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. తాజాగా ఓ సినిమాలో నటించిన హీరోయిన్, హీరోతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఏదైనా ఒక రహస్యాన్ని బయటపెట్టాలని యాంకర్ హీరోను అడుగుతుంది. అందుకు ఆ హీరో మాట్లాడుతూ ఏదైనా తినే సమయంలో తామంతా ఏదైనా స్వీట్ లేదంటే కారా ఐటమ్స్ తింటామని చెప్పారు. అయితే ఈమె మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పారు. దీంతో ఆ హీరోయిన్ కొంగుతో ముఖం దాచుకుంటుంది.

మంచి అలవాటు కాదు.. మానుకోవాలి
తనకు ఈ సినిమాలో ఈ హీరోయిన్ తో ఎటువంటి లిప్ కిస్ లు లేవని, దీంతో తాను బతికిపోయానని హీరో చెబుతాడు. దీంతో నెటిజన్లంతా షాక్ కు గురవుతున్నారు. కుక్క బిస్కెట్లు తినడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తినాలంటే చాలా బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయని, అది మంచి అలవాటు కాదని, మానుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ గా ఉంటూ, సెలబ్రిటీగా నలుగురికి స్ఫూర్తిగా ఉండే వ్యక్తికి అది మంచి అలవాటు కాదని, మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. మరి ఆ హీరోయిన్ మానుకుంటారో లేదో చూడాలి మరి.












Click it and Unblock the Notifications