బాక్సాఫీస్ వద్ద అతి ఫ్లాప్ సినిమా బాసూ ఇది..!
ఇటీవలి కాలంలో భారతీయ సినిమా పరిశ్రమ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. అయితే, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు అంచనాలను అందుకోలేక, నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చడం కొత్తేమీ కాదు. ఇటీవల కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2', సూర్య 'కంగువా', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', అక్షయ్ కుమార్ 'బడే మియా చోటే మియా' వంటి సినిమాలు భారీ బడ్జెట్‌తో నిర్మించినా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాలు నిర్మాతలకు వందల కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాయి.
కానీ, ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమా ఏదైనా ఉందంటే, అది 2012లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'జాన్ కార్టర్' (John Carter). వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని విడుదలైనప్పుడు ఒక విజువల్ వండర్‌గా ప్రచారం చేశారు. ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వంలో, దాదాపు రూ. 2,171 కోట్లు (250 మిలియన్ డాలర్లు) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే, థియేటర్లలో అడుగుపెట్టాక ఈ సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా, తప్పుడు మార్కెటింగ్ వ్యూహాలు సినిమా పరాజయానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 778 కోట్లు మాత్రమే వసూలు చేసి, డిస్నీ కంపెనీకి ఏకంగా రూ. 1,393 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇంతటి నష్టాన్ని మిగిల్చిన మరో సినిమా లేదు.
'జాన్ కార్టర్' సినిమా భారీ బడ్జెట్‌తో సినిమా తీసినంత మాత్రాన విజయం రాదని, ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, సరైన మార్కెటింగ్ ఎంత ముఖ్యమో నిరూపించిన ఒక చేదు అనుభవం.












Click it and Unblock the Notifications