హీరో విగ్గు పీకేసిన పోలీసులు.. రక్త పరీక్షలు, డీఎన్ఏ పరీక్షలతో కథ ముగిస్తున్న పోలీసులు !

ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్‌ అరెస్ట్‌ అయ్యి వారం రోజులు గడిచిపోయింది. గత ఎనిమిది రోజులుగా నటుడు దర్శన్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతోందని, నిందితులకు కేసుకు సంబంధించిన అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

హీరో దర్శన్ హత్య కేసులో అరెస్టు కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికీ షాక్ లో ఉన్నారు. ప్రస్తుతం హీరో దర్శన్ తో పాటు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి నిందితులు అందరిని తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తలపై పెట్టుకున్న విగ్గును పోలీసులు తొలగించినట్లు సమాచారం.

The police removed the wig from the head of Darshan who was arrested in a murder case

గత ఎనిమిది రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులందరినీ రేపు (శుక్రవారం) కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ-1 నిందితురాలు పవిత్రా గౌడ, ఏ-2 నిందితుడు హీరో దర్శన్ సహా నిందితులందరినీ వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా నిందితుల మాదిరిగానే దర్శన్ హెయిర్ శాంపిల్ సేకరించేందుకు ఆయన ధరించిన విగ్‌ని పోలీసులు తొలగించినట్లు సమాచారం.

హీరో దర్శన్ రేణుకాస్వామి మర్మాంగాన్ని తొక్కేసి హింసించాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారని తెలిసింది. హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ రక్తం, వెంట్రుకల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలను ప్రారంభించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన రోజు నుంచి పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

The police removed the wig from the head of Darshan who was arrested in a murder case

నిందితులను కోర్టులో హాజరుపరిచిన తరువాత న్యాయమూర్తి అనుమతితో మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసు అధికారులు బావిస్తున్నారని తెలిసింది. నిందితులు బెయిల్ కోసం వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. అయితే హత్య కేసులో నిందితులకు మూడు నెలల పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. హీరో దర్శన్, నటి పవిత్రా గౌడకు కూడా మూడు నెలలు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+