మహేష్‌బాబు - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సి ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి టాలీవుడ్‌లో ఒకప్పుడు పెద్ద చర్చ నడిచింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఒక ప్రముఖ దర్శకుడు వీరిద్దరి కోసం ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేసి వినిపించగా, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇద్దరూ నటించడానికి అంగీకరించారు.

అయితే అదే సమయంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేయడంతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కాస్తా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ చిత్రంతో బిజీ కావడం, వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఇద్దరూ బిజీ అయిపోవడం వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదు.

మహేష్ బాబు 'వారణాసి' షూటింగ్ పూర్తి.. టీజర్ ఎప్పుడంటే..?
మహేష్ బాబు 'వారణాసి' షూటింగ్ పూర్తి.. టీజర్ ఎప్పుడంటే..?
Tollywood Mahesh Babu and Junior NTR Were Set to Create a Blockbuster But It Never Happened

వీరిద్దరి మధ్య మంచి స్నేహం

అయితే, వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మహేష్ బాబును ఎంతో గౌరవంగా అన్న అని పిలుస్తుంటారు. గతంలో ఎన్టీఆర్ నిర్వహించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంలోనూ వీరిద్దరూ తమ మల్టీస్టారర్ విశేషాల గురించి సరదాగా పంచుకున్నారు.

మనం ఇద్దరం కలిసి ఎప్పుడూ ఒక చిత్రం చేద్దాం అని తారక్ అనగా, అందుకు మహేష్ స్పందిస్తూ ఆ అవకాశం అలా మిస్ అయిపోయిందని నవ్వుతూ బదులిచ్చారు. ఒకవేళ కనుక ఆ సమయంలో ఈ కాంబినేషన్ సాధ్యమై ఉంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ కొత్త రూపం సంతరించుకునేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులోనైనా ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటిస్తారేమోనని అభిమానులు ఇప్పటికీ ఆశిస్తూనే ఉన్నారు.

ఆ కమీనే గాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: నిప్పులు చెరిగిన జూనియర్ ఎన్టీఆర్
ఆ కమీనే గాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: నిప్పులు చెరిగిన జూనియర్ ఎన్టీఆర్

అభిమానుల కామెంట్స్

సోషల్ మీడియాలో ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. భారీ మల్టీస్టారర్ కాస్తా రాజమౌళి వల్ల సాధ్యపడలేదని, అది ఒప్పుకోకుండా ఈ సినిమా చేసుకుంటే రికార్డులు తిరగరాసేవారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ చేయడమే సరైందని, అందులో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, గ్లోబల్ స్టార్ అయ్యాడని, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+