విక్టరీ వెంకటేశ్ ఇంట్లో తీవ్ర విషాదం..

టాలీవుడ్ ప్రముఖ నటుడు, విక్టరీ వెంకటేశ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాను ప్రాణంగా ప్రేమించే పెంపుడు కుక్క గూగుల్ అకాల మరణం చెందింది. దీంతో విక్టరీ వెంకటేశ్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన కుటుంబ సభ్యుడిగా భావించే ప్రియమైన పెంపుడు శునకం మరణించడంతో ఆయన తీవ్ర వేదనకు లోనయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. తన పెంపుడు కుక్క గూగుల్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ తీవ్ర దుఃఖంలో ఉన్నారు. తన కుటుంబ సభ్యుడిగా భావించే ప్రియమైన పెంపుడు కుక్క మరణించడంతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. పెంపుడు కుక్క గూగుల్ తో ఉన్న అనుబంధాన్ని వెంకటేశ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం చేసిన భావోద్వేగభరితమైన పోస్టు అందరినీ కదిలిస్తోంది.

Tollywood Star Victory Venkatesh Mourns Loss of Beloved Pet Dog Google

పెంపుడు కుక్క గూగూల్ తో తమ కుటుంబానికి 12 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా తమతోనే ఉన్న గూగుల్ తమ జీవితాల్లో షరతులు లేని ప్రేమను, అందమైన జ్ఞాపకాలను నింపిందని వెంకీమామ తెలిపారు. "నా ప్రియమైన గూగుల్.. నువు మా జీవితాల్లో వెలుగులు నింపావు. ఈ రోజు నీకు వీడ్కోలు పలికాం. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నా ప్రియ నేస్తమా.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను" అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

ఇక వెంకటేశ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తాజాగా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ సినిమాలోనూ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+