తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో...
తెలుగు ప్రేక్షకులకు హ్యాపీడేస్ సినిమాతో పరిచయమయ్యారు హీరో నిఖిల్. ఆ సినిమా తర్వాత ఎన్నో మంచి సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి సినిమాలు మంచి విజయాలను అందించాయి. ఇక, కార్తికేయ 2 సినిమా అయితే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో హిట్ సాధించింది. టాలీవుడ్ యంగ్ హీరోల జాబితాలో ఉన్న నిఖిల్ 2020 సంవత్సరం కరోనా సమయంలో వివాహం చేసుకున్నారు. అయితే, నిఖిలిది ప్రేమ వివాహం. నిఖిల్ భార్యపేరు పల్లవి. పల్లవి వృత్తిరీత్యా వైద్యురాలు. అయితే, వీరిద్దరికి పెళ్లయి ఇప్పటికి నాలుగేళ్లు కావొస్తుంది. ఈమధ్య సోషల్‌మీడియాలో నిఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్ననిఖిల్ భార్య పల్లవి బేబీ బంప్‌తో ప్రత్యక్షమయ్యి ఆ వార్తలను నిజం చేశారు.
గతంలో ఈ జంట విడిపోతున్నట్లు ప్రచారం : ఈ నేపథ్యంలో నిఖిల్ తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై యంగ్ హీర్ నిఖిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఈ జంట విడిపోతున్నట్లు కూడా ప్రచారాలు జరిగాయి. అయితే, అందులో ఎలాంటి వాస్తవాలు లేవని వీరిద్దరూ తీవ్రంగా ఖండించారు. అయితే, వీరిద్దరూ కలిసి జంటగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ రూమర్స్‌కు చెక్‌పెట్టారు. అయితే, ఇప్పడు నిఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్తతో వీరి బ్రేకప్ వార్తలకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు.

స్వయంభు సినిమా కోసం కత్తిసాము శిక్షణ : ప్రస్తుతం హీరో నిఖిల్ స్వయంభు సినిమా షూటింగ్ బిజిలో ఉన్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము వంటి విద్యలను కూడా నేర్చుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం వీటికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. స్వయంభు చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిఖిల్ 20వ చిత్రంగా విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు భరత్ కృష్ణమాచార్య. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తన హెయిర్ ను కూడా పెంచి లుక్ మార్చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో నిఖిల్‌కి జోడిగా సంయుక్త మీనన్ నటించనున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications