"త్రిష బై- సెక్సువల్.. ఆడ, మగ ఎవ్వరినీ చూసినా..!!" ఆ సింగర్ షాకింగ్ కామెంట్స్..
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది ఆమె. అయితే టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఆయన భార్య సంగీతల విడాకులకు కారణం త్రిష అంటూ ఆమెపై సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్- త్రిషల ప్రేమాయణం కారణంగా సంగీత ఫ్యామిలీ నాశనం అయిందంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్- త్రిష జోడీగా ఐదు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి.
విజయ్ భార్య సంగీత గతంలో షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త విజయ్ ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల సంగీత కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అదే సమయంలో విజయ్- త్రిష చెన్నైలోని ఓ నిర్మాత కుమారుడి వివాహ వేడుకకు ఒకే కారులో వెళ్లారు. అంతేకాక వీళ్లిద్దరూ మ్యాజింగ్ అవుట్ ఫిట్ ధరించారు. సంగీత ఈ కామెంట్స్ చేసిన కొద్ది రోజులకే విజయ్- త్రిష ఇలా పబ్లిక్ ఈవెంట్స్ లో జంటగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో విజయ్ భార్య చెప్పిన ఆ హీరోయిన్ త్రిష అని సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి.

ఇదిలా ఉంటే తమిళ ప్రముఖ సింగర్ సుచిత్ర రామదురై త్రిషపై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో త్రిష బై సెక్సువల్ అని ఆరోపించారు. " త్రిష బై- సెక్సువల్.. ఆమెకు మగవాళ్లు, ఆడవాళ్లు ఎవరైనా ఇష్టమే.. అయితే త్రిషకు అబ్బాయిల కంటే అమ్మాయిలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె ఇప్పటికే చాలా రిలేషన్స్ లో ఉంది. ప్రస్తుతం విజయ్ ఆమె ఆధీనంలోనే ఉన్నారు. విజయ్ కు కుక్క పిల్లను చేసి ఆడిస్తోంది. త్రిష ఏం చెప్తే విజయ్ అది చేస్తున్నారు. కూర్చోమంటే కూర్చోవాలి.. నిల్చోమంటే నిల్చోవాలి" అని త్రిషపై సింగర్ సుచిత్ర రామదురై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications