డబ్బులకన్నా విలువలే ముఖ్యమన్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి. అందరూ పనిచేసేది డబ్బు కోసమేనని, డబ్బుంటేనే ఇక్కడ విలువిస్తారని చాలామంది బహిరంగంగానే చెప్పారు. అయితే డబ్బుకన్నా విలువలే ముఖ్యమనే నటులు కూడా ఉన్నవారు. తీసుకునే ప్రతి రూపాయి కూడా తమ కష్టంతో రావాలని, అంతేకాకుండా చేసే పనిని ఎంతో ఇష్టంతో చేయాలని వీరు భావిస్తారు. డబ్బులు అవసరమైనప్పటికీ వారసత్వంగా తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలను వీరు పాటిస్తుంటారు. అంతేకాదు విలువలను ఆచరించి చూపుతుంటారు. అటువంటివారిలో ప్రధానమైనవారు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.

తారక్ ను కొనియాడిన సినీ పెద్దలు
కొందరు దర్శక నిర్మాతలు కోట్ల రూపాయలు ఇస్తామని, ఫలానా పాత్రలు, ఫలానా భాషల్లో చేయాలంటూ వీరిద్దరినీ సంప్రదించారు. అయితే వాటికి తాము అర్హులం కాదని నిర్ద్వంద్వంగా తిరస్కరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాన ఎన్టీఆర్ పోలికలతోనే ఉంటారు. ముమ్మూర్తులా ఆయనలా ఉండే తారక్ తో ఎన్టీఆర్ పాత్ర వేయించాలని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు ప్రయత్నించారు. అయితే తారక్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఎన్టీఆర్ పాత్ర పోషించేంత శక్తి తనకు లేదని, ఆయన పాత్రకు తాను అర్హుడిని కాదని బహిరంగంగానే చెప్పేవారు. ఆ విధంగా ఆయన తన తాతపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ విషయంలో ఎంతోమంది సినీ పెద్దలు తారక్ పై ప్రశంసలు కురిపించారు.

Values are more important than money this is star heros Mahesh Babu and junior NTR opinion

ప్రిన్స్ పై ప్రశంసల జల్లు
మహేష్ బాబు తన సినిమాలు తాను చేసి, సమాజానికి చేయవల్సినవి మాత్రం ఎంతో గోప్యంగా చేస్తారు. ప్రచారాన్ని అసలు ఇష్టపడరు. ఆయన చేత బాలీవుడ్ సినిమాలు చేయించాలని దేశంలోని అగ్ర నిర్మాతలు, దర్శకులు ఎంత ప్రయత్నించినప్పటికీ వారిచ్చిన అవకాశాలను, ఇస్తామన్న కోట్ల రూపాయలను సున్నితంగా తిరస్కరించారు. తాను తెలుగుకు మాత్రమే పరిమితమని, తెలుగులో సినిమాలు తీయడం తనకు ఇష్టమని, తనకు అంతకుమించి కోరిక లేదని స్పష్టంగా చెప్పేవారు. ఆ విషయంలో తెలుగుపై, తెలుగు పరిశ్రమపై ఆయనకున్న అభిమానాన్ని ఎంతోమంది సినీ పెద్దలు కొనియాడారు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది హీరోలు వారికి నచ్చని పని చేయరు.ఇంతకి ఆ హీరోలు ఎవరు ? ఎందుకు ఆ పనులు చేయడానికి ఒప్పుకోవడం లేదు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+