వైరల్ గర్ల్ "మోనాలిసా".. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్..!

దరిద్రం ప్రతిసారీ తలుపు తడుతుంది. కానీ అదృష్టం మాత్రం లైఫ్ లో ఒక్కసారే తలుపు తడుతుంది అన్న త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్ కు మహా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా స్టోరీ సరిగ్గా సరిపోతుంది. మొన్నటివరకు ఇళ్లిళ్లూ తిరుగుతూ పూసలు అమ్ముకున్న మోనాలిసా.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఒక్కరోజులో.. ఒకే ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఫ్యాన్స్ ఆమె వీడియోను తెగ వైరల్ చేశారు. మోనాలిసా మోస్ట్ ఫేవరేట్ ఇండియన్ సెలబ్రిటి అంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

రోజుకు రూ. వెయ్యి రూపాయలు సంపాదించాలన్న లక్ష్యంతో మహాకుంభమేళాకు వచ్చిన మోనాలిసా.. నాలుగో రోజునుంచే వైరల్ కావడంతో ఇప్పుడు ఆమె వెంట నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటీవలే ఓ సినిమాలో నటించేందుకూ అంగీకరించింది. 'ది డెయిరీ ఆఫ్ మణిపుర్' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు మోనాలిసా ఒప్పేసుకుంది.ఇప్పటికే మోసాలిసాకు చిత్ర నిర్మాతలు రూ. 21 లక్షల చెక్ ఇచ్చారట. దీంతోపాటు లోకల్ బిజినెస్ వాళ్లు తమ సంస్థల పబ్లిసిటీ కోసం రూ. 15 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం మోనాలిసా ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Viral Sensation Mona Lisa Lands Multiple Movie Offers Takes Rs 35 Lakhs for Latest Film

మోనాలిసా ఏఐ సాంగ్స్ ట్రోల్..

బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ముజ్ కో రానాజీ మాఫ్ కర్ణా పాటకు వైరల్ గర్ల్ మోనాలిసా డ్యాన్స్ చేసినట్లు కొందరు ఆకతాయిలు ఆర్టిఫీసియల్ ఇంటిలిజెన్స్(AI) సాయంతో వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీంతో ఈ వీడియో అభ్యంతరంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏఐతో వీడియోలు తీయడం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఇది ఒరిజినల్ వీడియో అని.. ఏఐ వాడలేదని వాదిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మోనాలిసాను సినిమాల్లో చూడబోతున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+