అన్న మన సినిమాకు థియేటర్ ఖర్చులు కూడా రావడం లేదు..!

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒక సినిమా కలెక్షన్లు ముందుకు వెళ్లడం అటుంచి, వెనక్కి వెళ్తున్నాయి. 'వార్ 2' సినిమా తెలుగు వెర్షన్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రూల్‌లో నటించారనే ప్రచారం వార్-2కు బాగా నెగిటివ్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా సినిమాను కాపాడలేకపోయారు. తొలి సోమవారం నుంచి ప్రతి సెంటర్‌లోనూ ఈ సినిమా 'డెఫిసిట్స్' (Deficits) నమోదు చేసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 'డెఫిసిట్' అంటే సినిమా ప్రదర్శన ఖర్చులు కూడా రాబట్టలేకపోవడం.

సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు ఈ పరిస్థితి ఎదురైనప్పుడు, థియేటర్ల యజమానులు వెంటనే 'కమీషన్ బేసిస్' మీద సినిమాను నడుపుతారు. అంటే, వచ్చిన కలెక్షన్లలో కొంత వాటా థియేటర్‌కు, కొంత వాటా డిస్ట్రిబ్యూటర్‌కు పంచుకుంటారు. కానీ, 'వార్ 2' విషయంలో పరిస్థితి వేరు. సినిమా హక్కులు కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాత నాగవంశీ, మొదటి వారం మొత్తం థియేటర్లను 'రెంటల్ బేసిస్' మీద మాత్రమే నడిపించాలని ఒప్పందం చేసుకున్నారు.

War 2 Movie Flops A First in History as Collections Drop Below Theater Expenses

ఈ ఒప్పందమే ఈ సినిమా నష్టాలను మరింత పెంచింది. గురువారం వరకు రెంటల్ బేసిస్ ఉండటంతో, కలెక్షన్లలో భారీ కోత పడుతోంది. ఉదాహరణకు, కృష్ణా జిల్లాలో మొదటి నాలుగు రోజుల్లో దాదాపు రూ. 2 కోట్ల షేర్ వసూలు చేయగా, ఐదవ, ఆరవ రోజుల్లో డెఫిసిట్స్ కారణంగా కలెక్షన్లు రూ. 1.96 కోట్లకు పడిపోయాయి. ఇదే పరిస్థితి తూర్పు గోదావరి, నైజాం ప్రాంతాల్లోనూ కనిపించింది.

ఈ సినిమా ఘోర పరాజయం నాగవంశీ కెరీర్‌లోనే కాకుండా, గత రెండు దశాబ్దాలలో ఏ స్టార్ హీరో సినిమాకూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ పరిణామం స్టార్ హీరోలకు ఒక స్పష్టమైన హెచ్చరికగా మారింది. తమ స్టార్ స్టేటస్‌ను మాత్రమే నమ్ముకుని, సినిమా కథ, కంటెంట్‌పై శ్రద్ధ పెట్టకపోతే, భవిష్యత్తులో ఏ హీరోకైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 'వార్ 2' సినిమా ఫలితం ప్రేక్షకులకు ఇప్పుడు కేవలం స్టార్ డమ్‌ మాత్రమే కాకుండా, బలమైన కంటెంట్ కావాలని స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+