ఆ విషయంలో ప్రభాస్ సలార్, కల్కి మూవీలను బీట్ చేసిన తమిళ్ సినిమా..?
సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఆడియన్స్ ఎప్పుడు ఏ రకమైన సినిమాలను ఆదరిస్తారో, ఏ చిత్రానికి ఘన విజయం కట్టబెడతారో చెప్పలేం. ఒక్కోసారి రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయ్యి.. కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్స్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. తెలుగులో యావరేజ్ అనిపించుకున్న సినిమాలో కూడా హిందీ వెర్షన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్నవి కూడా ఉన్నాయి.
అలానే రిలీజ్ టైమ్ లో మూవీకి ఉన్న హైప్.. టీవీలో టెలికాస్ట్ అయ్యే సమయంలో టీఆర్పీ రేటింగ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. థియేటర్స్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఎన్నో సినిమాలు, టీవీ టెలికాస్ట్ లో మాత్రం అంతంత మాత్రంగానే నిలుస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి రుజువు అయ్యింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 800 కోట్లు, వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించిన చిత్రాలను ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టీఆర్పీ రేటింగ్స్ లో బీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం భారీ హిట్ అయ్యింది. అలానే ఆయన మరో చిత్రం కల్కి సైతం వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించింది. అయితే సలార్ చిత్రం టీవీలో మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు నాలుగు టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. కల్కి 5.25 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ గత ఏడాది తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన 'సత్యం సుందరం'చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చాయని.. భారీ కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ చిత్రాల కంటే ఎక్కువ రేటింగ్ రావడం గొప్ప విషయమే అని అనుకుంటున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2.. చిత్రాలలో నటించనున్నారు.












Click it and Unblock the Notifications