తెలుగు హీరోలకి ముస్లీం పాత్రలు ఎందుకు రాయరు - యంగ్ హీరో
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 'కమల్ కామరాజు'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు కమల్. ఆ తర్వాత ఆవకాయ్ బిర్యానీ సినిమాలో హీరోగా నటించి.. పలు సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంలో కూడా మంచి నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈయన.. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ముస్లిం పాత్రలు ఎందుకు రాయరు..?
శేఖర్ కమ్ముల కి అనీష్ కురివిల్లి మంచి ఫ్రెండ్, అనీష్ కూడా దర్శకుడుగా ఆవకాయ్ బిర్యానీ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో కమల్ హీరోగా నటించిన. దీంట్లో కమల్ ముస్లిం వ్యక్తి. ఒక డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రోడు ఆటో నడుపుకుంటూ తన డిగ్రీ కోసం కష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఊరు బాగుండాలి అభివృద్ధి జరగాలి అని కోరుకుంటాడు. ఈ సినిమాలో బిందు మాధవి హీరోయిన్ గా నటించింది. ఒక ఈ సినిమా మినహాయిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు హీరోలకు ముస్లిం పాత్రలు ఎందుకు రాయరు అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నలు లేవనెత్తాడు కమల్ కామరాజు.

కమల్ కామరాజు ఏమన్నారంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టరని వ్యాఖ్యానించారు. ఎందుకు ముస్లిం పేర్లు హీరోలకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తమిళ, మళయాలం భాషలలో హీరోలకు ముస్లింల పేర్లు పెడతారని.. ఒక్క తెలుగులోనే రామో.. గీమో అని పెడతారని చెప్పుకొచ్చారు. ఎందుకంటే మన అవగాహన శక్తి అంతే ఉందని ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ల అవగాహన శక్తి ఎంత ఉందో.. అంతలోనే సినిమా తీసేస్తారని తెలిపారు.
ఒక డబ్బాలో రాళ్లు వేసి.. ఊపుతూ సౌండ్ వస్తుంది కదా అని ఊపుతూనే ఉంటారు. లేదు వేరే డబ్బాలో వేస్తే.. వేరే సౌండ్ వస్తుంది కదా.. అలా ట్రై చేద్దాం అంటే.. ఇక్కడ సౌండ్ వస్తుంది కదా అని అదే డబ్బాలో రాళ్లు వేసి కొడుతూనే ఉంటారని ఉదాహరించారు. హీరోలకు ముస్లింల పేర్లు పెట్టరు కానీ.. సైడ్ క్యారెక్టర్స్‌కి పెడుతుంటారని అన్నారు. తెలుగులో ఎందుకు పెట్టడం లేదంటే ఇక్కడ మాత్రమే రైటర్స్ ఓ వర్గానికి సంబంధించిన వారు ఉన్నారని చెప్పారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ హాట్ డిస్కషన్ కి తెర లేపాయి.
సినిమాల్లోకి ఎంట్రీ..
స్వతహ గానే ఇంటీరియర్ డిజైనర్ అయిన కమల్.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని అసలు అనుకోలేదని చెప్పారు. ఆ వర్క్ కారణంగానే మొదట చంద్రశేఖర్ ఏలేటితో ఆ తర్వాత.. హను రాఘవపూడితో శేఖర్ కమ్ములతో పరిచయం అయ్యిందని తెలిపారు. శేఖర్ ఖమ్ముల డైరెక్షన్ చేసిన గోదావరి సినిమాలో నటించిన తర్వాత.. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి ఆవకాయ్ బిర్యానీ సినిమా చేయడం.. సినిమాల్లోకి రావడం అలా జరిగిపోయింది అంటూ వెల్లడించారు.
-
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications