యూట్యూబ్ ఓకే..మరి హైపర్ ఆది చేసే బూతు కామెడీ సంగతేంటీ..?

ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తండ్రి ,కూతుర్ల మధ్య బంధం గురించి ప్రణీత్ హనుమంతు తన యూట్యూబ్ ఛానెల్‌లో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటం జరిగింది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రణీత్ హనుమంతుపై నిరసన ఎదురైంది. పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం ప్రణీత్ హనుమంతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి టీవీ షోల్లో వచ్చే అడల్డ్ కంటెంట్ గురించి మాత్రం ఎవరూ స్పందించడం లేదు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో కామెడీ హద్దులు దాటిపోతుంది. ఈ షోల్లో సెక్సువల్, అసభ్య, అభ్యంతర కంటెంట్‌ ఎక్కువ అవుతుందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు.

YouTuber Praneeth Arrested Hyper Adi s Content Raises Questions

మొదట్లో ఈ షో హెల్తీగానే ఉండేది. అయితే జబర్దస్త్‌లోకి హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కామెడీ హద్దులు దాటిపోయిందనేది అక్షర సత్యం.తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు.తన ప్రాస కోసం అమ్మాయిని కించపరచడం,అశ్లీల కామెడీ స్కిట్స్‌ చేయడం వంటివి హైపర్ ఆది చూపిస్తుంటాడు. ఇక కామెడీ చేసేందుకు మరో టాపిక్ లేదన్నట్లుగా సోషల్ మీడియాలో నెటిజెన్లు పేల్చే జోకులను తీసుకొచ్చి తన స్కిట్‌లో వాడటం లేదంటే బాడీ షేమింగ్ చేసే కాన్సెప్ట్ చొప్పించి స్కిట్‌లో ఫన్ క్రియేట్ చేయడం చేస్తుంటాడు ఆది. ఇక అతని టీమ్‌లో పని చేసే కంటెస్టెట్స్ కూడా తమకు వచ్చిన అవకాశమే భాగ్యంగా భావించి సర్దుకుపోతుంటారు. దీంతో తోటి టీం లీడర్లు సైతం అతన్నే ఫాలో కావడం మొదలుపెట్టారు. హైపర్ ఆది పుణ్యమా అంటూ జబర్దస్త్ షోను ఓ బూతు షోగా మార్చేశారు.

కామెడీ చేయాలి కానీ అది హద్దులు దాటేలా ఉండకూడదని ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుతున్నారు.ఒకప్పుడు గురువారం శుక్రవారం వచ్చిందంటే చాలు ఫ్యామిలీ అంతా రాత్రి 9:30 గంటలకు కూర్చుని హాయిగా నవ్వుకునేలా జబర్దస్త్ షో సాగింది. ఇప్పుడు ఆ షో వస్తేనే పిల్లలు చూడకుండా టీవీ కట్టేయడమో లేక ఛానెల్ మార్చడమో చేస్తున్నామంటూ మహిళలు చెబుతున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్‌కు మంచి పేరుంది. గతంలో మంచి సినిమాలను అందించిన ఘనత ఆ నిర్మాణ సంస్థకు శ్యాంప్రసాద్ రెడ్డికి ఉంది.కానీ బుల్లి తెరపై మంచి కామెడీ షో అందించారని అంతా అనుకునేలోపే అది బూతు షోగా మార్చేశారనే వాదన వినిపిస్తోంది.ఇలా ఒక్క జబర్దస్త్‌లోనే కాదు.. శ్రీదేవి డ్రామా కంపెనీ,ఢీ లాంటి షోలలో కూడా ఆది బూతు కామెడీ చేస్తూ హైపర్ ఆది పబ్బం గడుపుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఒక్క రాకెట్ రాఘవ స్కిట్స్‌ మాత్రం ఇప్పటికి ఫ్యామిలీతో కూర్చోని చూసే విధంగా ఉంటున్నాయి. మిగత వారి స్కిట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగా జబర్దస్త్ షో తన వైభవాన్ని కోల్పోయింది. గతంలో జబర్దస్త్ షోకు ఉన్న గుర్తింపు కానీ రేటింగ్స్ కానీ ఇప్పుడు లేదనే విషయం అందరికి తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఒకరిద్దరు చేస్తోన్న తప్పులకు ఇలాంటి చరిత్ర కలిగిన జబర్దస్త్ షో తన ప్రాభవం కోల్పోవడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. యూట్యూబ్, ఆన్‌లైన్‌లో వచ్చే కంటెంట్ కంటే ఇలా నేరుగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే షోల్లో వచ్చే అశ్లీల కామెడీ వల్లే పిల్లలు, యూత్ చెడిపోతున్నారనేది సుస్పష్టం. మరి ఇలాంటి షోలపై నియంత్రణ ఎప్పుడు తీసుకువస్తారో చూడాలి. యూట్యూబర్ ప్రణీత్‌ను అరెస్టు చేశారు.. మరి బూతు కామెడీ పంచే పలు బుల్లి తెర షోల పరిస్థితి ఏంటి.. మంచు విష్ణు ఇది కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+