Fact Check: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్రైస్తవుడా ?
ఏపీలో ప్రభుత్వం కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీవీ 5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. ఆయనతో పాటు మరో 23 మందిని కలుపుకుని మొత్తం 24 మందికి ఈ బోర్డులో స్ధానం కల్పించారు. దీనిపై అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అయితే ఆలోపే సోషల్ మీడియాలో ఓ ప్రచారం విపరీతంగా సాగుతోంది.
టీటీడీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన బీఆర్ నాయుడు క్రిస్టియన్ అనేది ఈ ప్రచారం సారాంశం. ఇందుకు నిదర్శనంగా ఆయన ఆఫీసులో నిలబడిన ఓ ఫొటోతో పాటు అభినందనలు స్వీకరిస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన వెనుక ఓ క్రైస్తవ శిలువ ఆకారంలో ఉన్న ఓ వస్తువు కూడా ఉంది. దీన్ని సర్కిల్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ట్రోల్స్ చేస్తున్నారు. క్రైస్తవుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు మతంపై క్లారిటీ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ ను విడుదల చేసింది. ఇందులో టిటిడి చైర్మన్‌గా ఎంపికైన బిఆర్ నాయుడు గారు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.అంటూ ప్రభుత్వం తెలిపింది. దీంతో బీఆర్ నాయుడు మతంపై జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది.

Fact Check
వాదన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియా ప్రచారం
వాస్తవం
బీఆర్ నాయుడు క్రిస్టియన్ కాదని ఏపీ ప్రభుత్వం ప్రకటన












Click it and Unblock the Notifications