• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వార్టన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి

By Pratap
|

ఈ నెల 3వ తేదీన భిన్నమైన ఉగ్రవాద దాడిని చూశాం. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని ఉగ్రవాద దాడులకు భిన్నమైన దాడి ఇది. ఈ దాడి కొట్లాది మంది భారతీయుల ఉమ్మడి అంతరాత్మనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆత్మచైతన్యాన్ని కూడా కదిలించింది. ఈ దాడికి బౌద్ధిక స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛలతో పాటు భారత ప్రజల విచక్షణ బాధితాలుగా మారాయి.

ఈ దాడి ప్రేరిపితులను గుర్తించడం సులభమే. ఈ దాడిని అంచనా వేస్తూ చాలా 'బౌద్ధిక నివేదికలు' ఉన్నాయి. ఇది మొదటి దాడి కాదు, చివరిది కూడా కాదు. సత్యం, న్యాయంపై సొంతంగా రూపొందించుకున్న పోరాటంలో భాగంగా జరిగిన చిన్న దాడి ఇది. ఊహించి చెప్పినందుకు బహుమతులు ఏవీ ఉండవు. వార్టన్ ఎకనమిక్ ఫోరంలో కీలకోపన్యాసాన్ని రద్దు చేస్తూ వార్టన్ తీసుకున్న ఆక్షేపణీయమైన నిర్ణయం గురించి నేను మాట్లాడుతున్నాను. దీని వెనక సూత్రధారులు ఫైవ్ స్టార్ కార్యకర్తలు, మిథ్యా మేధావులు, మిథ్యా లౌకికవాదులైన బౌద్ధిక తాలిబన్లు. మోడీని ఎదుర్కోవడానికి వారు చేస్తున్న దాడి ఇది.

వార్టన్ వార్త బౌద్ధిక తాలిబాన్ల అనంతమైన స్వేచ్ఛ నన్ను పలు విధాలుగా అసంతృప్తికి గురి చేసింది. అత్యంత ప్రధానమైంది - ప్రముఖమైన సంస్థల్లో, భావ ప్రకటనకు స్వేచ్ఛ ఉన్న, ఉదార ప్రజాతంత్ర పునాదులు గల గర్వించే దగ్గ భూమిపై వారి చర్యలు సాగుతున్నాయి. వార్టన్ (పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం) వంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకుందంటే దానికి ప్రశస్తమైన ప్రపంచ విశ్వవిద్యాలయాల సరసన నిలబడే స్థాయి లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల భావప్రకటనా స్వేచ్ఛను కాపాడలేని విశ్వవిద్యాలయానికి నైఫుణ్యానికి, అకడమిక్‌కు సంబంధించిన ప్రోత్సాహం గురించి మాట్లాడే హక్కు ఉండదు.

Narendra Modi

వార్టన్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన చీకటి శక్తులను గుర్తు చేసుకుంటే, వారి కార్యనిర్వహణ పద్ధతి అర్థమవుతుంది. వార్టన్ బోగీకి మోడీని ఆహ్వానించకూడదని పట్టుబటిటన అనియా లూంబా సంగతి చూద్దాం. లూంబా అకడమిక్, వృత్తిపరమైన విషాయలు చూస్తే తగిన ఆధారాలు లభిస్తాయి. బౌద్ధిక తాలిబాన్‌కు బేస్ క్యాంప్ అయిన జెఎన్‌యులో చాలా కాలం ఆమె పనిచేసారు. లూంబా ఆ బౌద్ధిక తాలిబాన్‌కు చెందుతారు.

లూంబా ఫేస్‌బుక్ ప్రొపైల్‌లో బయటకు కనిపించే దృశ్యాలను బట్టి ఆమె ముందస్తు కార్యక్రమం ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఆమె మోడీ ఎస్ఆర్‌సిసి ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసనకారులను పైకెత్తే పనికి పూనుకున్నారు. అది ఇప్పుడు పోయింది. మోడీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం వేలాది మంది యువతీయువకులను అబ్బురపరిచింది. ఆ తర్వాత కొద్ది రోజులకు తన అత్యంత విలువైన సమయాన్ని అఫ్జల్ గురు 'దురదృష్టకరమైన ఉరితీత'ను నిరసించేందుకు వెచ్చించారు. (ఇది దురదృష్టకరమైంది అయితే అదృష్టమేమిటో ఆమె నిర్వచిస్తారా?). దానికితోడు, నిరంతరం పెట్టుబడిదారి విధానంపై విరుచుకుపడుతుంటారు. వార్టన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించకుండా తాజాగా ఆమె బౌద్ధికమైన తాలిబాన్ దాడికి దిగారు. 2008 నవంబర్ 26వ తేదీన దేశంపై యుద్ధం ప్రకటించిన 'చిన్నపాటి' నేరానికి పాల్పడిన అజ్మల్ కససబ్ పట్ల సానుభూతి ప్రదర్శించేవారిలో తప్పకుండా లూంబా ఉంటారు.

మోడీని వ్యతిరేకించడం ద్వారా పొట్టపోసుకుంటున్న పెద్దగా అల్లరి చేసే కార్యకర్తల నిబద్ధ గుంపునకు సంబంధించిన నమూనా లూంబా. మోడీ ఎస్ఆర్‌సిసికి వెళ్లినప్పుడు వారు అక్కడ ఉన్నారు. గుజరాత్ విషయం ముందుకు వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా సంజీవ్ భట్ భార్య పోటీ చేసినప్పుడూ వారున్నారు. గుజరాత్ వ్యతిరేక కార్యకలాపాలకు అధికారిక నివాసాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ జాబితా ఇంకా పొడుగ్గా ఉంది.

ప్రధానమైన అంశం భావప్రకటనా స్వేచ్ఛ. మోడీని, ఆయన అభిప్రాయాలను, రాజకీయాలను, ఆయన విధానాలను వ్యక్తులుగా, గుంపులుగా వ్యతిరేకించే స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ ఆయన భావప్రకటనా స్వేచ్ఛనే అడ్డుకునే కార్యాచరణ ఎందుకు? వాల్తేర్ ఇలా అంటారు -"నువ్వు చెప్పేదాన్ని నేను అంగీకరించకపోవచ్చు కానీ నీకు చెప్పే హక్కు ఉందనే విషయానికి మరణం వరకు మద్దతు ఇస్తాను". విమర్శకులు ఉండాలనే విషయాన్ని బలంగా అంగీకరించే నేత మోడీ. మోడీని వినడానికి ఇష్టపడకపోవడం, తమను స్వయం నిర్ధారిత కార్యకర్తలు తమ మానసిక చంచలత్వాన్ని, తమ వాదనలోని పసలేని తనాన్ని ప్రదర్శిస్తున్నారు. అభిప్రాయాలపై చర్చను ఆహ్వానించడాన్ని వారు నిరాకరిస్తున్నరాు. తమ తప్పుడు గొంతులను వినిపించే తప్పుడు ధోరణులను అవలంబిస్తున్నారు.

వార్టన్ ప్రవర్తన ఇతర భాగస్వాములను, స్పాన్సరర్స్‌ను ముందుకు తెస్తోంది. వారు గొంతులు ఎత్తి కార్యక్రమం నుంచి వారు వైదొగలగాల్సిన సమయం ఇదే. గౌతం ఆదానీ, సురేష్ ప్రభు గైర్హాజరు కావడానికి నిర్ణయించుకోవడం ఆనందకరమైన విషయం. అలా ప్రవర్తించకుండా మోంటెక్ సింగ్ ఆహ్లువాలియా, దిలీప్ చెరియన్, మిలింద్ దేవరాలను నిరోధిస్తున్నదేమిటి? ఆహ్వానితుల్లో జావెద్ అక్తర్, షబానా అజ్మీ కూడా ఉన్నారు. తమ పేర్లను ఉపసంహరించుకోవడానికి వారికి అడ్డు వస్తున్నదేమిటి? దేశ గౌరవం కన్నా అది ముఖ్యమా? స్పాన్సర్‌గా కలర్స్ చానెల్ వెనక్కి తగ్గాలని నిజమైన ప్రజాతంత్ర వాదులుగా మనం రాఘవ్ బాహ్ల్‌కు విజ్ఝప్తి చేద్దాం.

మొత్తం వ్యవహారం, నాలో రెండు అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వార్టన్ చర్యకు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుందా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల విశ్వవిద్యాలయం చూపిన అనుచితమైన ప్రవర్తనను దేశం అనుమతిస్తుందా? ఢిల్లీ విశ్వవిద్యాలయమో, ముంబై విశ్వవిద్యాలయమో అమెరికా గవర్నర్‌ను మాట్లాడకుండా నిరోధిస్తుందా? నా రెండో ప్రశ్న - దక్షిణ ఢిల్లీ స్టూడియోల నుంచి నడిచే ఒక ఇంగ్లీష్ చానెల్ తీసుకున్న చురుకైన పాత్రకు సంబంధించింది. నిరసనలను తొలుత ప్రోత్సహించడంలో వారు అంత చురుగ్గా ఎందుకు వ్యవహరించారు, బౌద్ధిక తాలిబాన్‌లకు అనవసరమైన ప్రచారం కల్పించి, వార్త వ్యాపించడానికి ఎందుకు దోహదం చేసింది? మనం వార్టన్‌ను నిందిస్తున్నాం. మన ప్రజలే ముందు భారతీయులుగా వ్యవహరించి, ఆ తర్వాత మోడీ వ్యతిరేక విధానాలను ఎందుకు అనుసరించాల్సిన అవసరం ఉంది.

భావప్రకటనా స్వేచ్ఛకు, ఉదార ప్రజాతంత్ర విధానాల ఆచరణకు అంతిమ స్థలంగా ఉండాలని అమెరికా వ్యవస్థాపక పితామహులు భావించారు. మన పితామహులు భావప్రకటనా స్వేచ్ఛను కాపాడడానికి కట్టుబడి పనిచేశారు. కులానికి, జాతికి, మతానికి భిన్నంగా ప్రతి ఒక్కరికీ గొంతును ఇచ్చారు. వార్టన్ చర్యలకు భారతదేశంలో పనిచేస్తున్న బౌద్ధిక తాలిబాన్ల ధోరణులకు సిగ్గుపడాల్సిన విషయం. జార్జి వాషింగ్టన్, జెఫర్సన్, మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేడ్కర్ తమ సమాధుల్లో నిరసిస్తుండే ఉంటారు.

- కిశోర్ త్రివేది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kishore Trivedi writes - A different kind of terror attack hit India on the evening of 3rd March 2013! This was an attack different from the one we witnessed in Hyderabad a few days ago but it was an attack enough to shake the collective conscience of a billion Indians as well as the larger Indian community worldwide. The victims of this dastardly attack were intellectual freedom, freedom of speech as well as the sensibilities of the people of India!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more