• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

100లో ప్రతీ 4గురిలో ఒకరు: నీట్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

|

హైదరాబాద్: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌)లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన 'జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష(నీట్‌)' ఫలితాలను సీబీఎస్‌ఈ శుక్రవారం విడుదల చేసింది.

కాగా, ఈ ఫలితాల్లో టాప్‌-100లో 23 ర్యాంకులతో.. మరే రాష్ట్రం సాధించని ఘనతను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించారు. అంతేగాక, టాప్‌-200లో 51 మంది మనవాళ్లే. అయితే టాప్‌-10 ర్యాంకుల్లో ఒక్కటి కూడా తెలుగు విద్యార్థులకు రాకపోవడం గమనార్హం.

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,38,890 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6,11,539 మంది అర్హత సాధించారు. వీరిలో 2,66,221 మంది అబ్బాయిలు.. 3,45,313 మంది అమ్మాయిలు. ఈ పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో 9,13,033 మంది రాయగా, హిందీలో 1,20,663 మంది రాశారు. అర్హత మార్కులను ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులకు 131గా.. మిగతా విభాగాలవారికి 107 మార్కులుగా నిర్ణయించారు.

జాతీయస్థాయిలో పంజాబ్‌లోని ముక్త్‌సర్‌కు చెందిన నవదీప్‌ సింగ్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. 720 మార్కులకుగాను 697 మార్కులు తెచ్చుకున్నాడు. 99.99 పర్సెంటైల్‌ స్కోరు సాధించాడు. మధ్యప్రదేశ్‌ విద్యార్థులు అర్చిత్‌ గుప్తా, మనీశ్‌ ముల్‌చందానీ ద్వితీయ, తృతీయ ర్యాంకులు దక్కించుకున్నారు. తాను ఢిల్లీలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్‌ వైద్యకళాశాల(ఎంఏఎంసీ)లో ఎంబీబీఎస్‌ చేయాలనుకుంటున్నానని నవదీప్‌ పేర్కొన్నాడు. చదువు, క్రికెట్‌ తప్ప దేనిపైనా తనకు ఆసక్తి లేదన్నాడు. అతడి తండ్రి గోపాల్‌ సింగ్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులు

అర్ణవ్ త్రినాథ్ - 685 మార్కులు-12వ ర్యాంక్

మంగాని దీపిక-681-24

వెంకట్ హేమంత్-680-30

ఎ అఖిల-680-32

జె అనూష రెడ్డి-678-38

వర్షారెడ్డి -675-54

కె ప్రీతి-675-56

నిఖిల్ చౌదరి-675-57

మాని దినేష్-672-72

neet rankers

ఏపీ విద్యార్థులు

ఎన్ మన్విత-685-14

సాయి శ్వేత-678-36

శ్రీలాస్య-675-51

అంకిత దాస్-375-52

మనోజ్ పవన్ రెడ్డి-675-59

నీరజ్ పవన్ రెడ్డి-672-70

వంశీకృష్ణ-671-73

చైతన్య గోపాల్-671-74

నేస్తం రెడ్డి- -89

వీరమాచినేని జైత్రీ-670-90

ప్రాథమిక వివరాల ప్రకారం తొలి వందలోపు ర్యాంకుల్లో 20కి పైగా ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు, పది ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు వచ్చాయి. హైదరాబాద్‌ విద్యార్థి అర్ణవ్‌ త్రినాథ్‌ జాతీయస్థాయిలో 12వ ర్యాంకుతో తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. కడప జిల్లా ఆర్‌టీపీపీ విద్యుదుత్పత్తి కేంద్ర కాలనీకి చెందిన నర్రెడ్డి మన్విత జాతీయస్థాయిలో 14వ ర్యాంకుతో ఏపీలో అగ్రస్థానంలో నిలిచింది. 200లోపు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 65వేల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. ర్యాంకులు సాధించిన 23 మంది తెలుగు విద్యార్థుల్లో 12 మంది తెలంగాణవారు కాగా.. ఏపీవారు 11 మంది ఉన్నారు. కాగా, కాగా, రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇంకా వెల్లడికాలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకులు తెలియాలంటే ప్రవేశ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందేనని తెలంగాణలోని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకరరెడ్డి తెలిపారు.

నిరుడు ప్రైవేటు వైద్యకళాశాలల్లోని 50 శాతం యాజమాన్య, ప్రవాస భారతీయ సీట్ల భర్తీకి మాత్రమే నీట్‌ ర్యాంకులను పరిగణనలోకి తీసుకున్నారు. తొలిసారిగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని అన్ని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ సీట్లనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ ద్వారా వీటి ప్రాతిపదికనే భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 131 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు.

అర్హత సాధించిన ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు

ట్రాన్స్‌జెండర్లు ఎనిమిది మంది పరీక్షకు హాజరవగా, ఐదుగురు అర్హత మార్కులు పొందారు. ట్రాన్స్‌జెండర్లు గత ఏడాది తొమ్మిది మంది పరీక్ష రాయగా, ముగ్గురు అర్హత సాధించారు.

English summary
No student from the Telugu states made it to the top 10 ranks of the National Eligibility Entrance Test, but there were 22 students from the state between the 11th and 100th ranks. This means every fourth student between the 11th and 100th ranks is from the two states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X