కాంగ్రెస్‌లో ఇంటిపోరు
రాష్ట్ర పోలీసు శాఖ మీద ఆయనది బలమైన ముద్ర . ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలో ఒక్క నంబియార్ మినహా ఇంత దీర్ఘకాలం రాష్ట్ర పోలీసుల దళాల అధినేతగా కొనసాగిన వారు మరొకరు లేరు. గతంలో నంబియార్ మాత్రం 1956 నుంచి 67 వరకు 11 ఏళ్లపాటు ఐజిపి పదవిలో కొనసాగారు. అప్పటి రోజులు వేరు. సామాజిక పరిస్థితులు ఇంత సంక్లిష్టంగా వుండేవి కాదు. ఉన్నత స్థానాలకు పోటీ కూడా పెద్దగా వుండేది కాదు. సీనియార్టీకే పెద్దపీట వేసేవారు. పోలీసులకు బాధ్యతలు కూడా ఎక్కువగా వుండేవి కాదు. సాధారణ శాంతిభద్రతలే ప్రధాన అంశంగా వుండేది. ఇప్పుడు పోలీసులు బలగాలు కొన్ని సందర్భాల్లో బహుపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితి వుంది.
దొర ఈ ఘనత సాధించడానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ప్రధాన కారణం. తెలుగుదేశం అధినేతకు ఆయనకు మధ్య వున్న సన్నిహిత సంబంధం దొర ఆ పదవిలో దీర్ఘ కాలం కొనసాగడానికి ప్రధాన కారణమని చెబుతారు. విమర్శలు, ప్రశంసల విషయం పక్కనబెడితే అనేక రకాలుగా ఆయన విలక్షణ వ్యక్తి. పుట్టపర్తి సాయిబాబాకు అనుంగు శిష్యుడు. పదవులో సోపానంలో పైకి ఎగబాకడానికి ఆయనకు లాభించిన అంశాల్లో ఇది కూడా ఒకటని చెబుతారు. కాంగ్రెస్ అధికారంలో వున్న కాలంలో కూడా ఆయనకు మంచి గుర్తింపే లభించినా, ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాత్రం అధికార పక్షానికి ఆప్తునిగా మారారు.












Click it and Unblock the Notifications
