దేశవాళీసుగంధంః మలేసియన్ కళలు
డిఎస్‌పి స్థాయి అధికారి ముందు ఇచ్చన వాంగ్మూలంతో నక్సలైట్లను వారి సానుభూతిపరులను నేరుగా కటకటాల వెనక్కి పంపే అధికారం పోటోకింద పోలీసులకు లభిస్తాయి. ఇప్పటివరకు వున్న చట్టాలకింద రెండుమూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడే నేరలకు పోటో కింద కనీసం పదిపదిహేనేళ్ల జైలు శిక్ష పడుతుంది. పోలీసు అధికారుల ముందు నేరం అంగీకరిస్తే చాలు బెయిల్ పిటీషన్ తిరస్కరించాల్సిందిగా న్యాయస్థానాన్ని పబ్లిక్‌ప్రాసిక్యూటర్ కోరవచ్చు. పాతచట్టాల ప్రకారం నక్సలైట్లు మాత్రమే నేరస్తులైతో పోటో ప్రకారం వారి సానుభూతిపరులు, వారికి ఆశ్రయం ఇచ్చేవారు కూడా నేరస్తులే. అంతే కాకుండా వారికార్యకలాపాల గురించి అవగాహన వున్న పౌరహక్కుల సంఘాల నేతలు, పాత్రికేయులను కూడా పోటో కింద బుక్ చేసే అధికారం పోలీసులకు లభిస్తుందని ప్రజాతంత్రవాదులు అంటున్నారు. నక్సలైట్ల కంటే ఎక్కువగా నక్సలైట్ల కార్యకలాపాలతో సంబంధం లేని ప్రజాస్వామిక వాదులు, పౌరహక్కుల కార్యకర్తలు పోటో వల్ల ఇక్కట్ల పాలయ్యే అవకాశం వున్నదని అంటున్నారు.












Click it and Unblock the Notifications
