తెరలేచిన తానా యూత్‌ సదస్సు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమెరికాలో ఉన్న తెలుగువారు సాధ్యమయినంత వరకుస్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. హిమాచల్‌ గవర్నర్‌ రమాదేవి తన ప్రసంగంలో భారతదేశంలో బలంగా ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగానే సామాజికపరమైన భద్రతలు లేనప్పటికీ భారతదేశంలోని వ్యక్తులు రాణించగలుగుతున్నారని ఆమె అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు కూడా కుటుంబవ్యవస్థకు ప్రాముఖ్యతనివ్వాలని ఆమె ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు వారికి ఉద్భోదించారు.

రాష్ట్రం అభివృద్ది పథంలో నడవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ఈ సదస్సులో పాల్గొన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనాయకుడు ఎర్రనాయుడు పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి