కన్సల్టెంట్లా, తెల్ల ఏనుగులా?

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్‌: ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు టెస్ట్‌ మ్యాచ్‌ల ర్యాకింగ్‌లో మొదటి పది స్థానాల్లో చోటు లభించలేదు. 1993 నుంచి ఇప్పటి వరకు మొదటి పది స్థానాల్లో టెండూల్కర్‌ లేకపోవడం ఇదే మొదటిసారి. తాజా ప్రైస్‌వాచ్‌ హౌస్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి) క్రికెట్‌ టెస్ట్‌ రేటింగ్‌లో సచిన్‌కు మొదటి పదిస్థానాల్లో స్థానం లభించలేదు.

ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసి భారత్‌కు విజయాన్ని అందించిన రాహుల్‌ ద్రావిడ్‌కు రెండో స్థానం లభించింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రియాన్‌ లారా తిరిగి ప్రథమ స్థానాన్ని పొందగలిగాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ హెడెన్‌ ప్రథమ స్థానంలో ఉన్నాడు. టాప్‌ టెన్‌ జాబితాను పిడబ్ల్యుసి గురువారం విడుదల చేసింది.

ద్రావిడ్‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగుల చేయడమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ద్రావిడ్‌కు ఇది నాలుగో డబుల్‌ సెంచరీ. సునీల్‌ గవాస్కర్‌ రికార్డును ద్రావిడ్‌ బద్దలు కొట్టాడు. ఇంత వరకు విదేశాల్లో అత్యధిక స్కోరు 221 పరుగులు. 1979లో గవాస్కర్‌ ఇంగ్లాండుపై సాధించాడు. ఆ రికార్డును ద్రావిడ్‌ ఆస్ట్రేలియాపై 233 పరుగులు చేసి అధిగమించాడు. వి.వి.యస్‌. లక్ష్మణ్‌ 11వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్‌ విభాగంలో మొదటి స్థానంలో ముత్తయ్య మురళీధరన్‌ అప్రతిహతంగా కొనసాగుతున్నాడు. రెండో స్థానం షాన్‌ పొలాక్‌దే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి