మరో అపకార బ్యాంక్
అందుకే బిజెపి ఎంత మొరాయిస్తున్నా వినకుండా మేయర్ పార్టీకి తామే పోటీ చేస్తామని తెలుగుదేశం తెగించి చెబుతున్నది. బిజెపి బాధ వేరు. ఆ పార్టీకి హైదరాబాద్‌లో నిలువనీడ దొరికిందంటే కారణం మజ్లిస్ వ్యతిరేకత మాత్రమే. ఆర్‌ఎస్‌ఎస్ కుదురు సంస్థగా మజ్లిస్ వ్యతిరేకతను మూటకట్టుకుని జంటనగరాల్లో ఉనికి నిలబెట్టుకున్న సంస్థకు మేయర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాకుండా ఎలా పోతుంది. అందుకే మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని ఒప్పించేందుకు చివరివరకూ విఫలప్రయత్నం చేసే యోచనలో బిజెపి వుంది. మరోవైపు మజ్లిస్‌కు కూడా ఇది అస్తిత్వ సమస్యే. తమ రాజ్యంలో తామే పరాయిలుగా మిగిలిన వేదన వారిది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లో సాగుతున్న తంతు ప్రధాన జీవనస్రవంతికి పాతబస్తీని ఎంతదూరం చేసిందో మునుముందు విస్పష్టంగా బయటపడుతుంది. ఆ లోపు మనుగడ కాపాడుకోవాలంటే బల్దియా ఎన్నికల్లో సత్తా చూపించుకోవడం చాలా అవసరమనే విషయం మజ్లిస్‌కు బాగా తెలుసు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.












Click it and Unblock the Notifications