వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
భగవత్‌స్వరూపంగా భారతీయ సమాజంలో మన్ననలు అందుకునే వైద్య నారాయణులు సంకుచిత కుల, వర్గ ప్రాతిపదికన ముఠాలు కట్టడం సంస్థ స్థాయిని సూచిస్తున్నదని చెబుతున్నారు. అవినీతి విషయంలోనైతే సంస్థపై అనేక ఆరోపణలు వున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె వెనక కూడా రాజకీయాలు వున్నాయనే అంటున్నారు. ఈ రాజకీయాలకు ఎవరికి అనుకూలంగా వారు భాష్యం చెప్పుకుంటున్నారు.
సంస్థ ప్రస్తుత డైరెక్టర్‌గా వున్న డాక్టర్ కాకర్ల సుబ్బారావు వృత్తిపరంగా మేటి, అధికార పార్టీకి ఆప్తుడు. అందువల్ల ఆయన చేతలను నేరుగా ఎండగట్టే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. అనేక ఏళ్లుగా నిమ్స్ డైరెక్టర్‌గా వున్న కాకర్ల సంస్థను ఎటు తీసుకుపోతున్నాడో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆయన ఉద్దేశ్యాలను, అభిప్రాయాలను అంచనావేయలేకపోతున్నారు. కాకర్ల హయాంలో నిమ్స్‌ను ఆశ్రయించుకుని ఒక వర్గం ఆర్ధికంగా అనూహ్యంగా ఎదిగిందనే ఆరోపణలు వున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!