వెలుగు చిమ్మే దీపావళి

Deepavali
భారతదేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి, దానం చేయాలి. సాయంకాలం గుళ్ళలో దీపాలని వెలిగించాలి. ఆనాటి వంటలో మినప ఆకులతో కూర వండుకుంటారు.

అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేస్తేసారు. సాయంత్రం లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్ళలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగా చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్ళల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో (బావి) తెప్పలవలే వదులుతారు.

ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని(అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్ర్యానికి సూచన) ఇండ్లనుండి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజింస్తారు. ఇది మూడవ రోజు. బలిపాడ్యమి. ఉదయం జూదాలాడుతారు. ఆరోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.

దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు. అందులో ప్రధానమైనవి:

1. నరకాసుర వధ
2. బలిచక్రవర్తిరాజ్య దానము
3. శ్రీరాముడు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
4. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం జరిగిన రోజు

ఈ కథలలో బలిచక్రవర్తికథ తప్ప మరి ఏది వ్రతగ్రంథములలోను, ధర్మశాస్త్రగ్రంధములలోను కనిపించదు. ధర్మసింధువంటి అన్ని గ్రంధములలోను బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడింది. నేడు దీపావళి అనగానే మనకు గుర్తువచ్చే బాణాసంచ కాల్పులుకు ఆధారమైన నరకాసురవధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రతగ్రంథాలలో కనపడదు. నరక భయనివారణార్థం అభ్యంగనస్నాం, దీపాలతో అలంకరించటం, లక్ష్మీపూజ తదితర విషయములు తెల్పబడ్డాయి. ఈ వ్రత గ్రంధాలలోని "నరక" శబ్దానికి నరకము అనుటానికి మారుగా "నరకాసురుడు" అని అన్వయించి తర్వాతివారు పురాణకథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమగు రహస్యం ఇమిడి ఉన్నదని కొందరి అభిప్రాయం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పిల్లలందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే దీపావళి రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే మరింత ఆనందం కలుగుతుంది. ఈ పండుగ జీవితకాల మాధుర్యంగా మిగిలిపోతుంది. మీ దీపావళి సరంజామాను కాల్చే విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి-

* ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన పెట్టుకోండి.
*నిప్పు రవ్వలు ఒంటిపైన దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే (పాలిస్టర్‌ కాకుండా) ధరించడం మంచిది.
* ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పి మంటలను నిరోధించవచ్చు. దుప్పట్లు కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు.
* ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ పూరి పాకపైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్‌ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్‌ నెంబరు గుర్తుపెట్టుకోండి.
* నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, అయోడిన్‌, టించర్‌, డెట్టాల్‌ తదితరాలతో కూడిన ఫస్ట్ ఎయిడ్‌ కిట్‌ సిద్ధం చేసుకోండి. ప్రాధమిక వైద్యం చేసిన… తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం ముఖ్యం.
* పిల్లలు దీపావళి సామగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.
* బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది.
* విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి. అత్యంత ముఖ్యంగా థౌజండ్‌ వాలా, 10 థౌజండ్‌ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకొని, పక్కవారికి చెప్పి కాల్చండి. అలాగే వీటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యం సృషించవద్దు.
* పిల్లల చేతికి రాకెట్‌, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని పూరిళ్లకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు.
* అలాగే భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.
* మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచవద్దు.
* వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.
* చల్లదనం కోసం ఇంటి ముందు లేదా మేడపైన తాటాకులు, గడ్డితో వేసుకున్న రిసార్ట్‌ల వంటి వాటిపై నీళ్లు చల్లి ఉంచుకోవడం మరచిపోవద్దు.
* వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి.
* ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి.
* గొప్పతనం కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి చేరువ కావద్దు.
* మీరు చూపే అత్యుత్సాహం వల్ల శబ్ద, వాయు కాలుష్యం అధికమై అది పర్యావరణం చేటుకు దారి తీస్తుందన్న విషయం మరచి పోవద్దు.
* పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు.

వన్ ఇండియా డాట్ ఇన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+