వైయస్ జగన్‌పై రామోజీ ఈనాడు 'పవర్'

సిక్కిం ప్రభుత్వం తీస్తానదిపై విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద యెత్తున చేపట్టి, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు పలు ప్రాజెక్టులను అప్పగించిందని, ఇందులో భాగంగా తీస్తా స్టేజ్ - 2 ప్రాజెక్టును హిముర్జా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించిందని, తీస్తా ఉపనది లాచెన్‌పై ీ 330 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించదలిచారని చెప్పింది. హిముర్జా ఇన్‌ఫ్రాలో వాస్తవానికి అరుణ్ గుప్తా, మను గుప్తా డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ తర్వాత చింతా శ్రీధర్, చింతా శశిధర్ డైరెక్టర్లుగా చేరారని, ఆ తర్వాత జగన్ సన్నిహితుడు సజ్జల దివాకర్ రెడ్డి ఇందులో డైరెక్టర్‌గా చేరిపోయారని, ఆయనతో పాటు జగన్‌కు సన్నిహితులైన హరీష్ సి. కామర్తి, నర్రెడ్డి సంగిరెడ్ిడ, జెజె రెడ్డి డైరెక్టర్లుగా నియమితులయ్యారని ఈనాడు వివరించింది. వారి వాటాలను 10 వేల నుంచి 50 లక్షలకు పెంచారని, ఆ తర్వాత ఈ వాటాల్లో భారతీ రెడ్డి 40 లక్షల వాటాను కొనుగోలు చేశారని ఈనాడు తెలిపింది. క్రమంగా భారతీరెడ్డి ప్రధాన వాటాదారుగా మారారని తెలిపింది.












Click it and Unblock the Notifications