వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌పాల్: అన్నా కోరిందేమిటి, ప్రభుత్వం చేసిందేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
ఇండియా పాలసీ వికీ అనే సంస్థ ప్రభుత్వ ప్రతినిధులు, అన్నా హజారే నామినీలు రూపొందించిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాలను భారతీయ భాషల్లోకి అనువాదం చేసి పక్కపక్కనే ఇచ్చింది. దీనివల్ల ఈ రెండు ముసాయిదాల్లోని తేడాలను గుర్తించడానికి వీలవుతంది. ఇండియా పాలసీ వికీ భారతదేశంలో తొలి పాలసీ ప్రాతిపదిక బహు భాషా వికీ. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకులు దీన్ని ఏర్పాటు చేశారు. భారతీయ భాషల్లో విధానపరమైన అంశాలపై చర్చలను ప్రోత్సహించిందుకు అవసరమైన వేదికను సరళీకృతం చేసింది.

భారతీయ భాషల్లోకి ఆ రెండు బిల్లు ముసాయిదాలను అందించడం వల్ల ప్రభుత్వానికి, సామాజిక కార్యకర్త అన్నా హజారే టీమ్‌కు మధ్య విభేదాలు ఎక్కడ చోటు చేసుకున్నాయో ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. తెలుగులో కూడా ఈ రెండు ముసాయిదాలను ఇండియా పాలసీ వికీ అందించింది. ప్రధానిని లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తేవాలని అన్నా హజారే బృందం చెబుతోంది. ప్రధానిని, న్యాయవ్యవస్థను మినహాయిస్తూ ప్రభుత్వ ప్రతినిధులు ముసాయిదాను రూపొందించారు.

ప్రధానంగా బయటి ప్రపంచానికి తెలుస్తున్న విస్తృతమైన అంశాలు అవే. ఇంకా ఏయే తేడాలున్నాయో కూడా వివరంగా తెలుసుకోవడానికి ఈ తారతమ్యం పట్టిక మనకు తెలియజేస్తుంది. ఈ తారతమ్య బేరీజు పట్టికను పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ రూపొందించగా, ఇండియా పాలసీ వికీ దాన్ని అనువాదాన్ని అందిస్తోంది.

రెండు ముసాయిదాల మధ్య ఉన్న తేడాను ఈ కింద క్లిక్ చేసి పొందండి.

English summary
India Policy Wiki is India's first policy based multi-lingual wiki, we are a non-partisan group of volunteers who have come together to build this platform to simplify and promote policy discussions in Indian languages. India policy Wiki recently translated the comparison of Lokpal bill drafts prepared by the government representatives on the Joint Committee on Lok Pal and the other drafted by the nominees of Anna Hazare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X