బహిర్గతం చేయనున్న ఎబిసి టెలివిజన్ సంస్థ..?

1963 నవంబర్ 22న కెన్నడీ హత్య తర్వాత కొద్ది నెలల పాటు ఆమె ప్రైవేటు సంబాషణలను ప్రముఖ చరిత్రకారుడు ఆర్థర్ ఎం స్కెలెసింగర్ జానియర్ రికార్డు చేసారు. అయితే వాటిని బయటకు వెల్లడి చేయకుండా బోస్టన్ లోని కెన్నడీ లైబ్రరీలో భద్రపరిచారు. గ్రీక్ షిప్పింగ్ దిగ్గజం అరిస్టాటిల్ ఒనసిస్ ను వివాహమాడిన తర్వాత 'జాకీ ఓ" గా ఆమె ప్రపంచానికి తెలిసింది.
కాగా తన ప్రైవేటు సంభాషణలను తాను మరణించిన 50 సంవత్సరాల తర్వాత మాత్రమే విడుదల చేయాలని 'జాకీ ఓ" ఆదేశించింది. తర్వాత 1994 మేలో ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఆమె చనిపోయి 50 సంవత్సరాలు పూర్తి కానప్పటికి కుమార్తె కరోలిన్ కెన్నడీ, యుఎస్ కు చెందిన టెలివిజన్ దిగ్గజం ఎబిసికి అందచేయాలని నిర్ణయం తీసుకున్నదని ' సండే ఎక్స్ ప్రెస్" తెలియజేసింది.
అయితే ఈ టేపుల్లో సంచలనాత్మక అంశాలున్న మాట వాస్తవమని టెలివిజన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండున్నర గంటల పాటు టివి స్పెషల్ లో వీటిని ప్రసారం చేయనున్నట్టు ఆయన చెప్పారు. అంతకు మించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసులో ఆయన గన్ మెన్ హార్వే ఆస్వాల్డ్ కూడా భాగస్వామేనని జాకీ గాఢంగా నమ్ముతున్నట్లు టేపుల్లో వెల్లడయ్యే అవకాశమున్నదని బ్రిటన్ కు చెందిన ఒక దినపత్రిక పేర్కొంది.
కెన్నడీ హత్యకు సంబంధించిన నిజాలు వెల్లడి కావాలని జాకీ భావించినప్పటికీ కుట్రదారుల నుంచి తనకు, తన పిల్లలైన కరోలిన్, జాన్ జూనియర్ లకు ప్రమాదమున్నదని భయపడినట్లు తెలుస్తోంది. అంతే కాదు హత్యకు ముందు రాత్రి కెన్నడీ దంపతులు చాలా సఖ్యతగా మెలిగారని ముఖ్యంగా మరింత మంది పిల్లలు కావాలనే అంశం వారి సంభాషణల్లో వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు వారిద్దరూ ఎప్పుడూ కీచులాడుకుంటుండేవారని ఎబిసి వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications