• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయాల్లో మహిళా ఆధిక్యతకు చొరవ

By Pratap
|

Kiran mMzumdar Shaw
బెంగళూర్: రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి గల మహిళలకు నాయకత్వ నైపుణ్యాలను నేర్పి, వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి కర్ణాటక రాజధాని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఓ వినూత్న కార్యక్రమం జరిగింది. భారత్ - నాయకత్వంలో మహిళలు, చొరవ (ఐ - విల్ ప్రోగ్రామ్) అనే అంశంపై ఈ కార్యక్రమంపై జరిగింది. పది వారాల ఈ వినూత్న కార్యక్రమాన్ని రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ఆదివారం ప్రారంభించారు.

ఐఐఎం - బెంగళూర్ ప్రభుత్వ విధానాల కేంద్రం, న్యూఢిల్లీ సామాజిక పరిశోధనా కేంద్రం ఆలోచనల నుంచి పుట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ, సామాజిక రంగాల నుంచి 30 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. యుఎన్ మహిళా, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నుంచి, కిరణ్ మజుందార్ షా నుంచి ఉపకారవేతనాలు కూడా అందుతున్నాయి.

మహిళా రాజకీయవేత్తగా తన విజయగాధను మార్గరెట్ ఆల్వా గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో మహిళా రాజకీయవేత్తలు మరింత మంది రావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఐ - విల్ ప్రోగ్రామ్ అంశాలను ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో విధానపరమైన విజ్ఞానం, రాజకీయ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, లింగ - సైద్ధాంతిక దృక్కోణాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి.

మహిళా రాజకీయ దిగ్దజాలు ఇందిరా గాంధీ, సోనియా గాంధీతో పనిచేసిన అనుభవం ఉన్న ఆల్వా- తమ ముందు భారీ లక్ష్యం ఉందని, ఐ - విల్ ప్రోగ్రామ్ ద్వారా పార్టీలకు అతీతంగా, రాష్టాల సరిహద్దులు దాటి పని చేసే గొప్ప అవకాశం లభించిందని, మనమే మన సాధికారితను పొందడానికి, భాహరత దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి, మహిళలు సమాన భాగస్వాములుగా మారి భారత చిత్రపటాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేద్దామని ఆమె అన్నారు.

ప్రభుత్వ సేవలను సమతుల్యం చేసే, అట్టడుగు వర్గాల పట్ల సేవా తత్పరత చూపే, పాలనలో వృత్తినైపున్యం ప్రదర్శించే, విలువలనూ దృష్టికోణాన్ని పెంపొందించేందు తెగువ చూపే నాయకుల అవసరం భారతదేశానికి ఉదని ఐఐఎంబి సిపిపి చైర్‌పర్సన్ ప్రొఫెసర్ రాజీవ గౌడ అన్నారు. మార్పును దోహదం చేసే నైపుణ్యాలను మహిళ రాజకీయ నాయకుల్లో పెంపొందిచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

సృజనాత్మక, విజ్ఞానదాయకమైన, వినూత్నమైన మహిళా నాయకత్వాన్ని రూపొందించడదానికి ఈ కార్యక్రమాన్ని ఐఐఎంబి, సిఎస్ఆర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ రంజన కుమారి చెప్పారు. భారత రాజకీయాల్లో మహిళలు తక్కువగా ఉండడమే కాకుండా, అగ్రభాగాన నిలిచే రాజకీయవేత్తలుగా ఎదగడానికి మహిళలు వివిధ అడ్డంకులను, అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని, అందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

English summary
A unique initiative, India-Women in Leadership (i-WIL) programme to hone the leadership skills and strengthen the capabilities of aspiring women politicians was launched at the Indian Institute of Management (IIM), Bangalore on Sunday. The 10-week certificate programme was inaugurated by Her Excellency, Margaret Alva, Governor of Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X