రైలు ప్రమాదం:మృత్యు ఒడిలోకి టెక్కీ దంపతులు

Tamil Nadu Express fire: Newlywed couple’s journey ends in flames
విజయవాడ: జీవితంపై అందమైన కలలు కంటూ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేసిన నూతన దంపతులను దురదృష్టం కాటేసింది. నెల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వారిద్దరు మరణించారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నూతన దంపతులు విజయవాడలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. పెనుగంచిప్రోలు మండలం అనిమల్లపాడు గ్రామానికి చెందిన కోపూరి వెంకటరమణకు, నందిగామకు చెందిన పల్లవి ఇటీవలే వివాహమైంది. ఎస్ - 11 బోగీలో ఎక్కిన వారిని మృత్యువు కాటేసింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రమణకు, పల్లవికి ఐదు నెలల క్రితమే వివాహమైంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో వారిద్దరు మాస్టర్స్ డిగ్రీ చేసారు. రమణ చెన్నైలోని ఫోర్డ్‌లో పనిచేస్తుండగా, పల్లవి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఐదు నెలలుగా పల్లవి నందిగామలో తన కుటుంబ సభ్యులతో ఉంటోంది. అషాఢ మాసం ముగియడంతో పల్లవిని తీసుకుని వెళ్లాలని కుటుంబ సభ్యులు రమణకు చెప్పారు.

రెండు రోజుల క్రితమే రమణ ఇంటికి వచ్చాడు. రమణ, అతని భార్య, అత్త తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ -11 బోగీలోని 49, 50, 51 సీట్లు వారికి రిజర్వయ్యాయి. రమణ పై బెర్త్ మీద పడుకున్నట్లు తెలుస్తోంది. అనిమల్లపాడులో శనివారం వీడ్కోలు తీసుకున్న నూతన దంపతులు ఆదివారం విజయవాడకు వచ్చి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించారు.

రమణ కుటుంబ సభ్యులు విషాద సంఘటనకు బోరుమంటున్నారు. చిన్నపాటి రైతు అయిన రమణ తండ్రి యల్లమందుకు నలుగురు పిల్లలు. రమణ చిన్నవాడు. మిగతా వారంతా గ్రామంలోనే వ్యవసాయం చేసుకంటున్నారు. రమణ ఒక్కడే పైచదువులు చదివి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+