ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులున్నారు. శనివారం ఉదయం వారు బ్రేక్ దర్సనం చేసుకున్నారు. ఆయనకు తిరుమల అధికారులు, పూజారులు సాదర ఆహ్వానం పలికారు.

తిరుమల ఆలయం డిప్యూటీ ఇవో చిన్నంగారి రమణ చంద్రబాబు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రసాదం అందించారు. వేద మంత్రాల మధ్య రంగనాయకులు మండపంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రసాదం, వస్తం అందజేశారు. టిటిడి సివిఎస్‌వో అశోక్ కుమార్, రామారావు, వెంకటయ్య, దామోదరం తదితరులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు.

సుదీర్ఘ పాదయాత్ర తర్వాత శ్రీవారి దర్శనంకోసం తొలిసారిగా చంద్రాబబు సొంత జిల్లాకు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంనుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు చంద్రబాబుకు దిష్టితీసి స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమనాయుడు, హేమలత, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు.

ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. వెంట సతీమణి భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేష్ కూడా ఉన్నారు.

ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

తిరుమలలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇలా..

ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

తిరుమలలో చంద్రబాబు నాయుడు ఇలా మొక్కులు..

ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

తిరుమలలో చంద్రబాబు నాయుడు ఇలా..

ఫొటోలు: తిరుమలలో కుటుంబ సమేతంగా బాబు

చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదం, వస్త్రాలు అందుకుంటూ ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+