వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వికీపిడియా సేకరిస్తున్న విజ్ఞాన భాండాగారాన్ని తెలుగు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలుగు వికిపిడియా, థియేటర్ ఔట్రిచ్ యూనిట్ , హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 11వ తేదీన ఉగాది పర్వదినంనాడు తెలుగు వికీపిడియా మహోత్సవాన్ని నిర్వహించారు. 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ గోల్డెన్ థ్రెసోల్డ్ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు తెలుగు వికీపీడియాకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు.

వికీ చైతన్య వేదిక సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ గోల్డెన్ ధ్రెసోల్డ్ ప్రాంగణంలో వికీ అకాడమిని నిర్వహించారు. ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని తేట తెలుగు నుడికారంతో తెలుగు ప్రజలకు పూర్తి ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో సాగుతున్న ఈ అక్షరయజ్ఞంలో భాగస్వామ్యులు అందరూ ఆకాంక్షించారు.

2001 జనవరి 15న ప్రారంభమైన వికిపి డియా ప్ర పంచ వ్యా ప్తంగా నేటికి 285 భాషల్లో 3 కోట్ల 63 లక్షల 46వేల 838 వ్యాసాలతో పురోగమిస్తోందని అన్నారు. భారతీయ భాషల్లో దాదాపు అన్ని భాషల్లో వికిపిడియా పనిచేస్తోందని, తెలుగులో 2003 డిసెంబర్ 10న ప్రారంభమైందని అన్నారు. తెలుగులో ప్రస్తుతం 51వేల 457 వ్యాసాలు ఉన్నాయని చెప్పారు.

ముగింపు కార్యక్రమంలో ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్యప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. తెలుగు భాషా పరిరక్షణోద్యమ సమాఖ్య నేత సామల రమేష్‌బాబు తెలుగు భాషాపరిరక్షణకు తాము చేస్తున్న కృషిని వివరించారు. ఆ సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం థియేటర్ ఔట్రీచ్‌కు చెందిన పెద్ది రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

వికీపీడియా మహోత్సవ కార్యక్రమంలో తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడుతున్న పారుపల్లి కోదండరామయ్య.

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

ముఖ్య అతిథులు మంగళగిరి ఆదిత్యప్రసాద్, సామల రమేష్ బాబు, కోదండరామయ్యల నుంచి సర్టిఫికెట్ తీసుకుంటున్న మల్లాది.

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

తెలుగు వికీపీడియాతో తమ అనుబంధాన్ని పంచుకుంటున్న వాలంటీర్లు.

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

చైతన్యవేదిక ముఖ్య అతిథులు సామల రమేష్ బాబు, ఆదిత్యప్రసాద్, కోదండరామయ్యలతో ఇతరులు..

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ నుంచి ప్రశంసా పత్రం అందుకుంటున్న అర్జునరావు.

ఫొటోలు: తెలుగు వికీపీడియా మహోత్సవం

ముఖ్య అతిథుల నుంచి ప్రశంసా పత్రం అందుకున్న రాధాకృష్ణ.

తెలుగు వికీపీడియాను ప్రారంభించిన వెన్న నాగార్జున సందేశం వీడియో క్యాసెట్ వేసి వినిపిచారు. మన చరిత్ర, మన సంప్రదాయాలను తెలుగు భాషలో వ్యక్తం చేసినంత సులువుగా ఇతర భాషల్లో వ్యక్తం చేయలేమని ఆయన అన్నారు. వికీమీడియాకు చెందిన అర్జున రావు, రాధాకృష్ణ తదితరులు కార్యక్రమాల్లో వికీ చైతన్య వేదిక పేరు మీద తాము చేస్తున్న కృషిని, తెలుగు వికీపీడియాను తీర్చిదిద్దుతున్న తీరును వివరిస్తూ తెలుగు వ్యాసాలను వికీపీడియాలో అందించాల్సిన తీరును, పాత వ్యాసాలను సరిదిద్దాల్సిన పద్ధతిని వివరించారు.

English summary
Wikipedia Mahotsavam has been held on Ugadi on april 11. It was held to enlighten on Telugu wikipedia. The orators stressed the need of protection of Telugu Language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X