Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలల సందడి మొదలైంది: మెరిసిన తారలు

హైదరాబాద్: వారం రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శనివారం శిల్పకళా వేదికపై అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

కేంద్ర మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని, బాలీవుడ్ నటీమణులు టటు, కరీనా కపూర్, కరిష్మా కపూర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలల చిత్రోత్సవాల నిర్వహణకు హైదరాబాద్‌ నగరాన్ని శాశ్వత వేదికగా చేసేందుకు అవకాశం ఉందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల పాటలు, డ్యాన్సులు అందరినీ అలరించాయి. బాలీవుడ్ తారలు కరీనా, కరిష్మా, టబు తదితరులు స్టేజీపై డాన్యులు చేసి బాలలను ఉత్సాహపరిచారు.

 వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం


దేశ, విదేశాల నుంచి వచ్చిన బాలలు, ప్రతినిధులతో శిల్ప కళా వేదిక కళకళలాడింది. నిర్ణయించిన విధంగానే సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 75 మంది బాలికల బృందం చేసిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది.

 వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

జాతీయ అవార్డు గ్రహిత హరిక్రిష్ణ ప్రదర్శించిన సాండ్‌ ఆర్ట్‌ ఔరా అనిపించింది. చిత్రానికి క్లాప్‌ కొట్టడం, పిల్లల కోసం గూటికి ఎగిరి వెళుతున్న పక్షి.., తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌ లాల్‌నెహ్రూ చిత్రం.., 19 న బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోగోను తన చిత్రాల ద్వారా ప్రదర్శించారు.

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో జరి గిన 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల ప్రారం భ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటీమణులు టబు, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు.
వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిఎఫ్‌ఎస్‌ఐ( చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటి ఆఫ్‌ ఇండియా) స్థాపించాక ఇప్పటి వరకు 11 సార్లు హైదరాబాద్‌ నగరం బాలల చిత్రోత్సవాలకు వేదికగా నిలిచిందని చెప్పారు.
 వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం


చుట్టూ ఉన్న పరిస్థితులపై చిన్నారులు మొబైల్‌ ఫోన్లతో షార్టు ఫిల్మ్‌లు చిత్రీకరించి యు ట్యూబ్‌లో ఉంచుతున్నారని రాథోడ్‌ తెలిపారు. తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సిఎఫ్‌ఎస్‌ఐ చైర్మన్‌ ముఖేష్‌ ఖన్నా మాట్లాడారు.

 వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం


ఈ చిత్రోత్సవాలు తన స్వస్థలం హైదరాబాద్‌లో జరగటం సంతో షంగా ఉందని బాలీవుడ్‌ నటి టబు అన్నారు. చిన్నారులకు ఉత్సవాలు స్ఫూర్తి నింపాలని నటి కరీనా కపూర్‌ ఆకాంక్షించారు. తన కుమార్తె నిర్మించిన షార్టు ఫిల్మ్‌ స్క్రీనింగ్‌కు సెలక్టయిందని కరిష్మా తెలిపారు.

 వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

వైభవంగా బాలల చలన చిత్రోత్సవం

కార్యక్రమంలో పాల్గొన్న చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ముఖేష్ కన్నా పిల్లలు ఫెస్టివల్‌లో చిత్రాలు చూసి ఎంజాయ్ చేస్తారన్నారు. సీఎఫ్‌సీఐ సీఈఓ శ్రవన్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల పాటు నగరంలోని 12 థియేటర్లలో దాదాపు 300 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+