ప్యాలెస్‌లో శోభా ఇండో, కెల్లీ జాజ్ స్వరాలు(పిక్చర్స్)
హైదరాబాద్: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ హైదరాబాద్ నగర సంస్కృతికి ప్రతీక. దీనిని సందర్శిస్తే ఎవరు మర్చిపోలేరు. 116 ఏళ్ల చరిత్ర గల లెదర్ గోడలు, అద్భుతమైన సీలింగ్ ఆకట్టుకుంటాయి. ఫలక్‌నుమా ప్యాలెస్ భారత దేశంలోకెల్ల గొప్ప ప్యాలెస్‌లలో ఒకటి. ఫలక్‌నుమా ప్యాలెస్‍ను మూడు ఎకరాల్లో నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం.
ఈ ప్యాలెస్‌లో సోమవారం హుక్కా ప్యాలెస్ లాంజ్ పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో ఉత్తరాది సంగీత రారాణి బేగం అక్తర్ శిష్యురాలైన శోభా సూర్య, ప్రముఖ జజ్ సంగీత గాయని కెల్లీ జాన్సన్‌లు అలరించారు.
బేగం అక్తర్ శిష్యరికంలో తాను నేర్చుకున్న లక్నోవి ఘరానాతో పాటుగా గిరిజా దేవి శిష్యురాలిగా తాను నేర్చిన బెనారస్ ఘరానాలకు తన స్వంత శైలి జోడించి నార్త్ ఇండియన్ మధురుమలను రేఖా సూర్య వినిపిస్తే, జాజ్ అందాలను కెల్లీ జాన్సన్ పరిచయం చేశారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది.

ప్యాలెస్ 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రసిద్ధ తాజ్ పలక్‌నుమా ప్యాలెస్‌లో ప్యాలెస్ జిఎం గిరిష్ సెహగల్‌తో ప్రముఖ కళాకారిణి రేఖ సూర్య.

ప్యాలెస్ 2
రాజధాని హైదరాబాదులోని ప్రసిద్ధ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రతిష్టాత్మక హుక్కా లాంజ్. దీనిని సోమవారం పునఃప్రారంభించారు.

ప్యాలెస్ 3
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ భాగ్యనగర సంస్కృతికి ప్రతీక. సంగీత కార్యక్రమంలో పాల్గొన్న జజ్ గాయని కెల్లీ జాన్సన్.

ప్యాలెస్ 4
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గల హుక్కా లాంజ్ వద్ద ప్రముఖ జజ్ గాయకురాలు కెల్లీ జాన్సన్ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

ప్యాలెస్ 5
హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గల హుక్కా లాంజ్ వద్ద ప్రముఖ జజ్ గాయకురాలు కెల్లీ జాన్సన్ చిరునవ్వులు చిందిస్తూ...

ప్యాలెస్ 6
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గల దర్బార్‌లో కళాకారిణి రేఖ సూర్య ప్రదర్శన. హుక్కా పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ఇచ్చారు.












Click it and Unblock the Notifications