శోక సముద్రం: యశోదాలో కెసిఆర్, పవన్ (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదం దుర్ఘటనలో గాయపడిన విద్యార్థుల మృతదేహాలతో సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రి తల్లడిల్లుతోంది. వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో వాతావరణం హృదయవిదారకంగా ఉంది.
యశోదా ఆస్పత్రిలో 20 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏడుగురిని వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, 9 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి రాజయ్య చెప్పారు.
వైద్య శాఖ కమిషనర్ ఇక్కడే ఉండి వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆస్పత్రి వద్ద బాధితులకు వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. తమ పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శోకసముద్రం ఇలా..
తమ పిల్లల పరిస్థితికి ఓ మహిళ ఇలా గుక్క పట్టి ఏడ్చింది. తిరిగి వస్తామంటూ చెప్పి ప్రమాదానికి గురైన పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది.

ఓ చిన్నారి ఆస్పత్రి పడకపై
అభం శుభం ఎరుగని ఓ చిన్నారి రైలు ప్రమాదానికి గురై యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

యశోదా అస్పత్రి వద్ద ఇలా..
సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఆ ఆస్పత్రి వద్ద ఇలా..

పవన్ కళ్యాణ్ ఇలా...
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరామర్శించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఓ తల్లి శోకం..
ప్రమాదంలో గాయపడిన తన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే దృశ్యాన్ని తలుచుకుని ఓ తల్లి ఇలా శోకసముద్రంలో మునిగిపోయింది.

ఇలా ఓదార్పు...
ఓ తల్లి శోకాన్ని చల్లార్చడానికి ఇతర మహిళలు ఓదార్పు వచనాలు పలుకుతూ, భరోసా ఇస్తూ ఇలా కనిపించారు.

తలకు గాయమై...
ఆడుతూ పాడుతూ బస్సులో పాఠశాలకు బయలుదేరిన చిన్నారులను నాందేడ్ ప్యాసెంజర్ రైలు ఢీకొడితే ఆ గాయాలతో ఇలా..

కోదండరామ్ ఇలా..
తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, ఇతర నాయకులతో కలిసి యశోదా ఆస్పత్రిలో పిల్లల పరిస్థితిని చూశారు.

ఏం పాపం చేశామని..
తాము ఏం పాపం చేశామని యశోదా ఆస్పత్రి పడకపై ఇలా చికిత్స పొందుతూ ఓ చిన్నారి ఇలా.. తీవ్రగాయాలతో...

అసలేమైందీ...
పాఠశాల బస్సులో బయలుదేరిన పిల్లలను నాందేడ్ రైలు మృత్యురూపంలో దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఇలా..

ఈటెల రాజేందర్ ఇలా...
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ యశోదా ఆస్పత్రిలో పిల్లలను చూసి, ప్రభుత్వం తరఫున బాధితులకు భరోసా ఇచ్చారు.

ఓ చిన్నారి ఇలా..
యశోదా ఆస్పత్రిలో ఓ చిన్నారి చికిత్స పొందుతూ ఇలా అచేతన స్థితిలో పడి... పాపం పుణ్యం ప్రపంచమార్గం ఎరుగని చిన్నారికి ఈ బాధలు..

గీతా రెడ్డి ఇలా...
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూడడానికి కాంగ్రెసు నాయకులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఇలా..

అయ్యో పాపం...
నాందేడ్ ప్యాసెంజర్ రైలు ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. ఆ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయపడిన బాలుడు ఒకతను ఇలా..

కెసిఆర్ ఇలా...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు యశోదా ఆస్పత్రిలో పిల్లలను పరామర్శించి, బాధితులకు భరోసా ఇచ్చారు.

నాయని నర్సింహా రెడ్డి ఇలా..
యశోదా ఆస్పత్రిలో తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ఇలా కనిపించారు. యశోదా ఆస్పత్రిలో వైద్య సేవలను తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

లక్ష్మణ్ ఇలా..
బిజెపి నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ యశోదా ఆస్పత్రి వద్ద ఇలా కనిపించారు. బాధితులను ఆయన పరామర్శించారు.

పనవ్ కళ్యాణ్ ఇలా...
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూడడానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు.












Click it and Unblock the Notifications