పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో లడ్డూ (ఫోటోలు)
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం తొలిపూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం స్వయంగా వేద పండితులతో కలిసి మంత్రాలను జపిస్తూ ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకొని పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇక, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి చేతిలో ఆరువేల కిలోల భారీ లడ్డూ వైవేద్యంగా పెట్టారు.
కాకినాడ తాపేశ్వరానికి చెందిన సురుచి పుడ్స్ అధినేత మల్లిబాబు నాలుగేళ్లుగా గణపతికి లడ్డూనూ నైవేద్యంగా సమర్పిస్తూ చరిత్రకెక్కారు. క్రేన్ సాయంతో ట్రాలీ నుంచి గణపతి చేతిలో లడ్డూను అమర్చారు. ముందుగా లడ్డూను భారీ గణపతి పాదాల వద్ద ఉంచి మల్లిబాబు కుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
భారీ గణపతికి లడ్డూను నైవేద్యంగా ఇస్తున్న మల్లిబాబు ఈసారి ప్రత్యేకంగా తయారు చేసిన ఆరుకిలోల లడ్డూను సమర్పించిన నేపథ్యంలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
గురువారం ఈ సర్టిఫికెట్‌ను సంస్ధ సీఈఓ సుమన్ పల్లె, దేవీ ఉపాసకులు దైవజ్ఞశర్మల చేతుల మీదుగా ఈ రికార్డు సర్టిఫికెట్‌ను మల్లిబాబు అందుకున్నారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
ఆయనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కూమార్ యాదవ్ తదితరులు పూజలో పాల్గొన్నారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
ప్రతి సంవత్సరం మాదిరిగానే భారీ గణపతికి అంబికా దర్బార్ అగరబత్తి వారి ఆధ్వర్యంలో 10 అడుగుల అగరబత్తిని అందజేశారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
దీన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెలిగించారు. నిమజ్జనానికి వినాయకుడు తరలే వరకు 11 రోజుల పాటు ఇక్కడ అగరబత్తి వెలుగుతూనే ఉంటుందని సంస్ధ అధికారి మహేందర్ తెలిపారు.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
ఖైరతాబాద్ గణపతి వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వినాయక చవితి నుంచి ఈనెల 26 వరకు ఉచిత వైపై సేవలనందిస్తోంది.

పుణ్యక్షేత్రంగా ఖైరతాబాద్: చేతిలో భారీ లడ్డూ
గురువారం ఈ సేవలను టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ లాంఛనంగా ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications