తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి సేవలో అల్లరి నరేష్ దంపతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడో రోజూ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తి పూర్వకంగా జరిగాయి. తిరుపతి వేంకటేశ్వరస్వామి పవిత్ర దేవాలయంలో నిత్యపూజలు చేసే అర్చకులే ఇక్కడ పూజలు చేస్తూ భక్తులకు మహదావకాశం కల్పించారు.

సోమవారం ఉదయం తెల్లవారుజామున సుప్రభాతం గీతంతో నిత్యపూజార్చనలు ఆరంభించారు. తిరుమల వేంకటేశ్వరుడికి అలంకరించే అసలు సిసలైన అద్భుత పుష్పాలతో ఇక్కడి వేదికపైన కొలువు తీరిన స్వామివారికి అలంకరించారు. తర్వాత సర్వదర్శనం భాగ్యం కలిగించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సహస్రదీపాల కాంతుల్లో స్వామి వారు వెలిగిపోయారు.

అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పల్లకిని ముట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. తిరుమలకు వెళ్లి కోటి రూపాయల కానుకలు ఇస్తామన్నా లభించని స్వామివారి ఏకాంత సేవను తిలకించే భాగ్యం నగరవాసులకు లభించింది. ఉదయం నుంచి రాత్రి పదిగంటల వరకు వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని సేవించుకున్నారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడో రోజూ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తి పూర్వకంగా జరిగాయి.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

తిరుపతి వేంకటేశ్వరస్వామి పవిత్ర దేవాలయంలో నిత్యపూజలు చేసే అర్చకులే ఇక్కడ పూజలు చేస్తూ భక్తులకు మహదావకాశం కల్పించారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

సోమవారం ఉదయం తెల్లవారుజామున సుప్రభాతం గీతంతో నిత్యపూజార్చనలు ఆరంభించారు.

శ్రీవారి సేవలో అల్లరి నరేష్ దంపతులు

శ్రీవారి సేవలో అల్లరి నరేష్ దంపతులు

తిరుమల వేంకటేశ్వరుడికి అలంకరించే అసలు సిసలైన అద్భుత పుష్పాలతో ఇక్కడి వేదికపైన కొలువు తీరిన స్వామివారికి అలంకరించారు. తర్వాత సర్వదర్శనం భాగ్యం కలిగించారు.

శ్రీవారి సేవలో అల్లరి నరేష్ దంపతులు

శ్రీవారి సేవలో అల్లరి నరేష్ దంపతులు

సాయంత్రం ఏర్పాటు చేసిన సహస్రదీపాల కాంతుల్లో స్వామి వారు వెలిగిపోయారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగించారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

పల్లకిని ముట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. తిరుమలకు వెళ్లి కోటి రూపాయల కానుకలు ఇస్తామన్నా లభించని స్వామివారి ఏకాంత సేవను తిలకించే భాగ్యం నగరవాసులకు లభించింది.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

ఉదయం నుంచి రాత్రి పదిగంటల వరకు వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని సేవించుకున్నారు. జన్మ చరితార్థమైందని సంతృప్తిని వ్యక్తం చేశారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

1991 నుంచి తిరుపతి వేంకటేశ్వరస్వామికి జరుపుతున్న విశేషపూజను ఇక్కడి వేదికపై నిర్వహించారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

మలయప్ప స్వామి అనుమతి తీసుకుని చతుర్దశ కలశాలతో శ్రీవారు భూదేవి, శ్రీదేవి విగ్రహాలకు పూజలు చేశారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

అర్చక స్వాములు పుణ్యహవచనం పలికిన తరువాత పంచసూక్తులను పఠిస్తుండగా చక్కగా విశేషపూజ జరిగింది. భక్తులు రెప్ప వాల్చకుండా వీక్షించి తరించారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

వెంకన్న స్వామిని జన్మలో దర్శించుకుంటామా లేదా అని తపన పడే భక్తులున్న విషయం తెలుసుకుని హైదరాబాద్‌లో వైభవోత్సవాలను ఏర్పాటు చేశామని ఉత్సవాలకు సౌజన్యం అందిస్తున్న హర్ష టయోటా నిర్వహకురాలు ముప్పవరపు రాధ హర్షవర్ధన్‌ నాయుడు తెలిపారు.

శ్రీవారి వైభవోత్సవం

శ్రీవారి వైభవోత్సవం

న్యాయమూర్తులు జస్టిస్‌ రాంమోహన్‌రావు, అశోక్‌బాబు, న్యాయకోవిదులు మాడభూషి శ్రీధర్‌, పరుచూరి గోపాలకృష్ణ, అల్లరి నరేష్ దంపతులు, ఆర్యన్ రాజేష్ దంపతులు, తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Srivari Vaibhavotsavam in held Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X