ఇండియన్‌సిఇవోల క్లబ్బుల విలీనం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: వాషింగ్టన్‌ డిసిలో ప్రవాసభారతీయులైన అమెరికన్‌ సిఇవోలుస్థాపించిన క్లబ్బు ఇప్పుడు సిలికాన్‌ వ్యాలీలోనిప్రవాస భారతీయ వ్యాపారుల సంఘంతో చేతులుకలిపి,అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థలో కీలక చోదకశక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నది. వాషింగ్టన్‌డిసి లో ఏర్పాటయిన ఇండియన్‌ సిఇవో హైటెక్‌కౌన్సిల్‌ ఇక నుంచి సిలికాన్‌ వ్యాలీలోని ఇండస్‌ఎంటర్‌ప్రీన్యూర్స్‌ కు డిసి చాప్టర్‌గా వ్యవహరిస్తుంది.ఈ మేరకు వాషింగ్టన్‌లో జరిగిన ఇండియన్‌ఎంటర్‌ప్రీన్యూర్స్‌ సదస్సులో నిర్ణయంతీసుకున్నారు. ఐసిఇవో ఎంటర్‌ప్రీన్యూర్‌షిప్‌-2000 పేరిటఏర్పాటుచేసిన ఈ సదస్సుకు 400 మందికిపైగా ఎన్‌ఆర్‌ఐ వ్యాపారులుహాజరయ్యారు. వీరు కాకుండా నెట్‌వర్కింగ్‌రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునేఔత్సాహికులు, వెంచర్‌ కాపిటల్‌కోసం అంగలార్చేవారుఅనేక మంది కూడా సదస్సులో పాల్గొన్నారు.
ఇండియన్‌ సిఇవో హైటెక్‌ కౌన్సిల్‌తూర్పుతీరంలో శరవేగంతో ఎదుగుతున్నప్రవాసుల సంస్థకాగా, ఇండస్‌ ఎంటర్‌ప్రీన్యూర్స్‌ కుఅమెరికాలో 10 చాప్టర్లు ఇండియాలో 5 చాప్టర్లు వున్నాయి.ఈ రెండు సంస్థల ఫిలాసఫి, లక్ష్యం దాదాపుఒక్కటేనని ఈ విలీనం వల్ల రెండుసంస్థలకు లాభం చేకూరుతుందని ఐసిఇవోడైరెక్టర్‌ శృతిరెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X