బాలయ్యకు సైకిల్ సారథ్యం?

Balakrishna
మెగాస్టార్ చిరంజీవికి పోటీగా తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నటుడు బాలకృష్ణ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బాలకృష్ణ గతంలో అన్యాపదేశంగా చెప్పారు కూడా. అయితే, ఏ హోదాలో రాజకీయాల్లోకి రావాలన్నదే సమస్యగా ఉందని ఆయన ఆ సందర్భంలో అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి దూసుకొస్తున్న ప్రస్తుత స్థితిలో అందుకు విరుగుడు కనిపెట్టాల్సిన అవసరం అత్యవసరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ స్థితిలో బాలకృష్ణ తప్ప మరొకరు అందుకు పనికి రాబోరనే విషయాన్ని తేల్చుకుంది. దీంతో బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించాలనే యోచనలో ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎన్టీరామారావు కుటుంబ సభ్యులు ఒక అంగీకారానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సెప్టెంబర్ 19వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఏ మేరకు నిజమనేది ఇప్పుడే చెప్పలేం. అయితే ముఖ్యమంత్రి పదవిని మాత్రం చంద్రబాబుకే కట్టబెట్టాలని నిర్ణయం జరిగిందట. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. తారకరత్న మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీపై గానీ, రాజకీయాలపై గానీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని ఆయన గతంలో ఒక్కసారి అన్నారు.

చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కొంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని నివారించడమే కాకుండా సినీ గ్లామర్ తో చిరంజీవిని ఎదుర్కోవాలనే పట్టుదలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని, అందుకే బాలకృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+